వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని ఏఐసీసీనేత, మాజీ ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని ఏఐసీసీనేత, మాజీ ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఏకమై ప్రజాదుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఇద్దరు సీఎంలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేపట్టిన ఆయుత చండీయాగానికి నిధులెక్కడివి? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఆయుత చండీయాగానికి సంబంధించిన నిధుల వివరాలు చెప్పాలన్నారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలలతో కలిసి క్విడ్ ప్రొకో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలే ఆయుత చండీయాగానికి నిధులిస్తున్నారని ఆరోపించారు. బీసీ క్రిమిలేయర్ అమలు సరికాదని, వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని మధుయాష్కి కోరారు.