నకిలీ సెల్‌ఫోన్ అంటగట్టి మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది
నాగోలు(హైదరాబాద్): నకిలీ సెల్‌ఫోన్ అంటగట్టి మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. శంషాబాద్‌కు చెందిన నిర్వన్‌పటేల్ సెల్‌ఫోన్ కోసం ఈ కామర్స్ వెబ్సైట్ ఓఎల్‌ఎక్స్‌లో వెతుకుతుండగా ఎల్‌బీనగర్‌కు చెందిన కొంతమంది సామ్‌సాంగ్ గెలాక్సీ ఫోన్ ఇస్తే ఐఫోన్6ఎస్ ఫోన్‌ను ఎక్చేంజ్ ఆఫర్‌లో ఇస్తామని చెప్పారు.
ఇది నమ్మిన నిర్వన్‌పటేల్ గురువారం సాయంత్రం ఎల్‌బీనగర్‌కు రాగా వారు అదనంగా మరో రూ.15 వేలు ఇస్తే కొత్త ఫోన్ ఇస్తామని నమ్మించాడు. అనంతరం డమ్మీ ఐ ఫోన్ నిర్వన్‌పటేల్‌కు ఇచ్చి పారిపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న నిర్వన్‌పటేల్ శుక్రవారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.