breaking news
fake cell phone
-
ఒక్క ఫోన్ కాల్ విలువ రూ.40,000!
నెక్కొండ: ఎస్బీఐ నుంచి ఫోన్ చేసిన అపరిచిత కాల్‌ను స్పంచింది ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతానుంచి 40,019 రూపాయలు మాయం అయిన ఘటన శనివారం శనివారం మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. మండలంలోని గేటుపల్లి గ్రామానికి చెందిన బాదావత్ సారయ్యకు ఉదయం 8345072647 నెంబర్‌తో ఎస్బీఐ బ్యాంక్ నుంచి అంటూ ఓ కాల్ వచ్చింది. ఏటీఎం కార్డు కాలపరిమితి అయిపోయిందని చెప్పిన అపరిచిత కాల్‌కు సారయ్య స్పందించాడు. ఏటీఎం కార్డు కాల పరిమితిని పునరుద్దరించుటకు కార్డుపై ఉన్న బార్ కోడ్ 19 అంకెలు తెలపాల్సిందిగా కోర గా ఆ వివరాలు చెప్పాడు. కొద్ది సేప టికి తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ 62207648956 నుంచి రూ. 40.019 డ్రా చేసినట్లు తన ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఉదయం ధాన్యం డబ్బులు రూ. 40,000లు డ్రా చేయాల్సి ఉందని బ్యాంక్ వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దారుణం జరిగిందని సారయ్య విలేకరుల ముందు బోరుమని విలపించారు. ఈ విషయంపై సారయ్య బ్యాంక్ అధికారులను సంప్రదించాగా.. అపరిచిత కాల్‌కు స్పందించడంతో అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయ్యాయని తెలిపారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఐఫోన్ ఇస్తామని చెప్పి..
నాగోలు(హైదరాబాద్): నకిలీ సెల్‌ఫోన్ అంటగట్టి మోసానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. శంషాబాద్‌కు చెందిన నిర్వన్పటేల్ సెల్‌ఫోన్ కోసం ఈ కామర్స్ వెబ్సైట్ ఓఎల్ఎక్స్లో వెతుకుతుండగా ఎల్బీనగర్కు చెందిన కొంతమంది సామ్సాంగ్ గెలాక్సీ ఫోన్ ఇస్తే ఐఫోన్6ఎస్ ఫోన్‌ను ఎక్చేంజ్ ఆఫర్లో ఇస్తామని చెప్పారు. ఇది నమ్మిన నిర్వన్పటేల్ గురువారం సాయంత్రం ఎల్బీనగర్కు రాగా వారు అదనంగా మరో రూ.15 వేలు ఇస్తే కొత్త ఫోన్ ఇస్తామని నమ్మించాడు. అనంతరం డమ్మీ ఐ ఫోన్ నిర్వన్పటేల్కు ఇచ్చి పారిపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న నిర్వన్పటేల్ శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.