ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000! | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

Published Sun, Jun 16 2019 11:52 AM

Cyber Crime Fake Cell Warangal Police Station - Sakshi

నెక్కొండ: ఎస్‌బీఐ నుంచి ఫోన్‌ చేసిన అపరిచిత కాల్‌ను స్పంచింది ఓ వ్యక్తి బ్యాంక్‌ ఖాతానుంచి 40,019 రూపాయలు మాయం అయిన ఘటన శనివారం  శనివారం మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. మండలంలోని గేటుపల్లి గ్రామానికి చెందిన బాదావత్‌ సారయ్యకు ఉదయం 8345072647 నెంబర్‌తో ఎస్‌బీఐ బ్యాంక్‌ నుంచి అంటూ ఓ కాల్‌ వచ్చింది. ఏటీఎం కార్డు కాలపరిమితి అయిపోయిందని చెప్పిన అపరిచిత కాల్‌కు సారయ్య స్పందించాడు. ఏటీఎం కార్డు కాల పరిమితిని పునరుద్దరించుటకు కార్డుపై ఉన్న బార్‌ కోడ్‌ 19 అంకెలు తెలపాల్సిందిగా కోర గా ఆ వివరాలు చెప్పాడు. కొద్ది సేప టికి తన బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ 62207648956 నుంచి రూ. 40.019 డ్రా చేసినట్లు తన ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది.

దీంతో ఉదయం ధాన్యం డబ్బులు రూ. 40,000లు డ్రా చేయాల్సి ఉందని బ్యాంక్‌ వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దారుణం జరిగిందని సారయ్య విలేకరుల ముందు బోరుమని విలపించారు. ఈ విషయంపై సారయ్య బ్యాంక్‌ అధికారులను సంప్రదించాగా.. అపరిచిత కాల్‌కు స్పందించడంతో అకౌంట్‌ నుంచి డబ్బు డ్రా అయ్యాయని తెలిపారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 
Advertisement
 
Advertisement