కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధమా? | bjp leaders challange to trs party on central funding | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధమా?

Jun 12 2016 3:25 AM | Updated on Aug 20 2018 9:16 PM

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై టీఆర్‌ఎస్ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ సవాల్ విసిరింది.

టీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ సవాల్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై టీఆర్‌ఎస్ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ సవాల్ విసిరింది. టీఆర్‌ఎస్ నేతలు సవాల్ స్వీకరిస్తే రూ.90 వేల కోట్ల నిధులకు సంబంధించిన వివరాలను తాము తీసుకొస్తామని ప్రకటించింది. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్‌రావులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల హవా నడుస్తోందని, వారి మాటే చెల్లుబాటవుతోందని అన్నారు. ప్రజల తరఫున బీజేపీ గొంతు వినిపించే సరికి సహించలేకపోతోందన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా తీవ్ర అవస్థలకు గురిచేస్తోందన్నారు. హైకోర్టు విభజన సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని నిందిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement