ఆటో డ్రైవర్ నిజాయితీ | Auto driver.. honesty | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ నిజాయితీ

Sep 2 2014 3:23 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఆటో డ్రైవర్ నిజాయితీ - Sakshi

ఆటో డ్రైవర్ నిజాయితీ

అతనికి దొరికిన దాదాపు రెండు లక్షల విలువైన వస్తువులను ఆశపడకుండా.. ఆ బ్యాగ్ను పోలీసులకు అప్పగించి ప్రశంసలందుకున్నాడు.

హైదరాబాద్: నిజాయితీకి మారు పేరుగా ఓ ఆటో డ్రైవర్గా నిలిచాడు. అతనికి దొరికిన దాదాపు రెండు లక్షల విలువైన వస్తువులను ఆశపడకుండా.. ఆ బ్యాగ్ను పోలీసులకు అప్పగించి ప్రశంసలందుకున్నాడు. హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ సంఘటన జరిగింది.

ఓ ప్రయాణికుడు తన బ్యాగ్ను ఆటోలోనే మరచి వెళ్లాడు. అనంతరం ఆటోలో బ్యాగ్ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని యజమానికి అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆచూకీ తెలియకపోవడంతో ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగ్ను అప్పగించాడు. దాన్ని యజమానికి అందజేయాల్సిందిగా పోలీసులను కోరాడు. బ్యాగ్లో మూడు తులాల బంగారం గొలుసు, లక్ష రూపాయిల విలువైన పట్టు చీరలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement