ప్రారంభమైన ఏపీ ప్రివిలేజెస్ కమిటీ భేటీ | AP Privileges committee meeting started over Assembly committee hall at Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ ప్రివిలేజెస్ కమిటీ భేటీ

Oct 25 2016 11:56 AM | Updated on Aug 18 2018 9:09 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్లోని అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైంది. గత నెల ఎనిమిది నుంచి పది వరకూ జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 12 మంది తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వివరించనున్నారు.

అసెంబ్లీ కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ ఈ నెల 15న వీరికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కమిటీ ముందు ఆరుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నానిగుడివాడ), చెవిరెడ్డి భాస్కర రెడ్డి (చంద్రగిరి), దాడిశెట్టి రామలింగే శ్వరరావు (రాజ తుని), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), రాచమల్లు శివప్రసాదరెడ్డి (ప్రొద్దుటూరు) అభిప్రాయాలను కమిటీ తెలుసుకోనుంది.

అదేవిధంగా రేపు (బుధవారం) కూడా  అదే సమయానికి కమిటీ ముందు మరో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి, బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), ఎం. సునీల్ కుమార్ (పూతలపట్టు), కంబాల జోగులు (రాజాం) అభిప్రాయాలను కమిటీ తెలసుకోనుంది.

Advertisement
 
Advertisement
Advertisement