రాష్ట్ర బంద్.. నగరంలో ఉద్రిక్తత | all partys bandh so many leaders arrested in hyderabad | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బంద్.. నగరంలో ఉద్రిక్తత

Oct 10 2015 7:35 AM | Updated on Sep 3 2017 10:44 AM

రాష్ట్ర బంద్.. నగరంలో ఉద్రిక్తత

రాష్ట్ర బంద్.. నగరంలో ఉద్రిక్తత

రాష్ట్రబంద్కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

హైదరాబాద్ : రాష్ట్రబంద్కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు అక్కడ బైఠాయించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్ లను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడినుంచి తరలిస్తున్నారు. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేంత వరకు పోరాడుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. మెహిదిపట్నంలో షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి బస్సులకు దారిచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

జూబ్లీ బస్టాండ్ వద్ద బైఠాయించిన టీటీడీపీ, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్ రమణ, చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్, తదితరులను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి అంబర్ పేట పీఎస్కు తరలించారు. కూకట్పల్లి డిపో వద్ద విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్కు తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement