ఆప్కో వస్త్రాలపై 50 శాతం తగ్గింపు | 50 percent decreased on Apco clothes | Sakshi
Sakshi News home page

ఆప్కో వస్త్రాలపై 50 శాతం తగ్గింపు

Oct 7 2016 2:32 AM | Updated on Mar 28 2019 5:39 PM

దసరా, దీపావళి పండుగల సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో చైర్మన్ గుజ్జ శ్రీను తెలిపారు.

హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో చైర్మన్ గుజ్జ శ్రీను తెలిపారు. గురువారం తిలక్‌రోడ్‌లోని జీహెచ్‌ఎంసీ కాంప్లెక్స్‌లో ఆప్కో నూతన శాఖను ఆయన ప్రారంభించారు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందన్నారు. ఆప్కో వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేతకు చేయూతనిచ్చినట్లుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ కె.జగదీశ్వర్‌రావు, డివిజన్ మార్కెటింగ్ ఆఫీసర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement