తెలంగాణకు 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు | 50 mega watershed projects are sanctioned to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు

Sep 21 2014 3:22 AM | Updated on Sep 2 2017 1:41 PM

సమీకృత వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) కింద తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

తెలంగాణకు 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు

ఎనిమిది జిల్లాల్లోని రెండు లక్షల హెక్టార్లకు ప్రయోజనం

సాక్షి, హైదరాబాద్: సమీకృత వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) కింద తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 50 మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ (వాటర్‌షెడ్స్) 2014-15 సంవత్సరానికి సంబంధించి పంపిన ప్రతిపాదనలకు ఐడబ్ల్యూఎంపీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర భూవనరుల శాఖ నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. దీంతో ఈ ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ శనివారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్ పీటర్ ఉత్తర్వులిచ్చారు. కొత్తగా మంజూరైన ప్రాజెక్టుల వల్ల ఎనిమిది జిల్లాల పరిధిలోని రెండు లక్షల హెక్టార్ల భూమికి ప్రయోజనం కలగనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement