5 ప్యాక్!

5 ప్యాక్!


సాక్షి, సిటీబ్యూరో : ఎస్సార్‌డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్)లో భాగంగా మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు/ గ్రేడ్ సెపరేటర్లు/ అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీ ఐదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. దీని అంచనా వ్యయం రూ.1096.71 కోట్లు. వీటి కోసం తొలుత ఈపీసీ- డిఫర్డ్ యాన్యుటీ విధానంలో జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. దీని వల్ల జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. దీంతో వాటిని రద్దు చేసింది. తాజాగా ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ)- టర్న్‌కీ విధానంలో అంతర్జాతీయ స్థాయిలోటెండర్లు పిలిచింది. గతంలో ఒకే ప్యాకేజీగా ఉన్న 18 పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. గతంలో ఈపీసీ-డిఫర్డ్ యాన్యుటీ విధానంలో రూ.2,631 కోట్లతో టెండర్లను పిలవగా... ప్రస్తుతం ఐదు ప్యాకేజీలకు అంచనా వ్యయం రూ.1096.71 కోట్లు కావడం గమనార్హం. 24 నెలల్లో పనులు పూర్తి కావాలని పేర్కొన్నారు.



 పూర్తి వివరాలకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ (www.ghmc.gov.in)లో

www.tender.eprocurement.gov.in చూడవచ్చు.



 ఏం చేయాలంటే...

 విశ్వ నగరంలో భాగంగా ఎలాంటి సిగ్నల్ ఆటంకాలు లేకుండా సాఫీ ప్రయాణానికి 20 ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు తొలుత  గత మే 30న ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తె లిపింది. వాటిలో 18 పనులకు డిఫర్డ్ యాన్యుటీ విధానంలో టెండర్లు పిలిచారు. తాజాగా ఈపీసీకే మొగ్గు చూపుతున్నారు. టెండరు దక్కించుకునే సంస్థ సర్వే, ఇన్వెస్టిగేషన్, సమగ్ర డిజైన్ పనులు చేయాల్సి ఉంటుంది. ఫై ్లఓవర్లు,/అండర్‌పాస్‌లలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసి సమీపంలోని డ్రైన్లకు కలపాల్సి ఉంది. ఎలక్ట్రిఫికేషన్, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీ, పేవ్‌మెంట్ మార్కింగ్ చేయాలి. అవసరమైన ప్రాంతాల్లో (ఉదా: కేబీర్‌పార్కు చుట్టూ, మైండ్‌స్పేస్, ఉప్పల్) పేవ్‌మెంట్, రిటైనింగ్ నిర్మాణాలు, జాగింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయాలి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top