కృష్ణా పుష్కరాలకు 202 రైలు సర్వీసులు | 202 train services to krishna ample | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు 202 రైలు సర్వీసులు

Jul 14 2016 1:34 AM | Updated on Sep 4 2017 4:47 AM

కృష్ణా పుష్కరాలకు ైరె ల్వే శాఖ ఈసారి కాస్త ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకు ైరె ల్వే శాఖ ఈసారి కాస్త ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కృష్ణా పుష్కరాలకు కూడా ‘గోదావరి’ తరహాలో రద్దీ ఉంటుందని భావిస్తున్న రైల్వే తొలిదఫాగా 202 సర్వీసులను ప్రకటించింది. పుష్కరాలు మొదలయ్యాక పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్‌కుమార్ బుధవారం విడుదుల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ పోర్టు మధ్య ఆగస్టు 11 నుంచి 24 వరకు రెండు వైపులా కలిపి 28 సర్వీసులుంటాయి.

తిరుపతి-కాకినాడ మధ్య ఆగస్టు 11 నుంచి 24 వరకు 28 సర్వీసులు, కాచిగూడ-కాకినాడ మధ్య ఆగస్టు 15 నుంచి 22 వరకు నాలుగు సర్వీసులు, తిరుపతి-విశాఖపట్నం మధ్య 12 నుంచి 19 వరకు నాలుగు సర్వీసులు, విజయవాడ-విశాఖపట్నం మధ్య 11 నుంచి 14, 18 నుంచి 21 వరకు 16 సర్వీసులు, హైదరాబాద్-గద్వాల మధ్య 11, 18 తేదీల్లో నాలుగు సర్వీసులుంటాయి. మణుగూరు-తెనాలి మధ్య 12 నుంచి 23 తేదీ వరకు 24 సర్వీసులు, విజయవాడ-ఒంగోలు మధ్య 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో 12 సర్వీసులు, హైదరాబాద్-గుంటూరు మధ్య 12 నుంచి 23 తేదీ వరకు 24 సర్వీసులుంటాయి. తిరుపతి-రాజమండ్రి మధ్య 14 నుంచి 21 వరకు రెండు వైపులా 10 సర్వీసులు, గుంతకల్-కృష్ణా మధ్య రెండు వైపులా 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో 12 సర్వీసులు, గుంతకల్-విజయవాడ మధ్య 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో తిరుగుప్రయాణంలో 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో 12 సర్వీసులుం టాయి. సికింద్రాబాద్- గద్వాల మధ్య 12 నుంచి 23 వరకు 24 సర్వీసులు నడుస్తాయి. రైలు నెంబర్లు, సమయాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement