breaking news
Special train resevations
-
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ పెరగడంతో తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు ఈ రైళ్లు అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మీదుగా శబరిమలకు చేరుకుంటాయి. డిసెంబర్ 13 నుంచి 31 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి వెళ్తాయో వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు ఇప్పటికే సుమారు 60 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.చర్లపల్లి -కొల్లం జంక్షన్ (07119), సిర్పూర్ కాగజ్ నగర్ -కొల్లం జంక్షన్ (రైలు నం. 07117), చర్లపల్లి -కొల్లం జంక్షన్ (07121), నాందేడ్ - కొల్లం (07123) రైళ్లకు డిసెంబర్ 3 నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు రైళ్లకు బుధవారం ఉదయం 8గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
కృష్ణా పుష్కరాలకు 202 రైలు సర్వీసులు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకు ైరె ల్వే శాఖ ఈసారి కాస్త ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కృష్ణా పుష్కరాలకు కూడా ‘గోదావరి’ తరహాలో రద్దీ ఉంటుందని భావిస్తున్న రైల్వే తొలిదఫాగా 202 సర్వీసులను ప్రకటించింది. పుష్కరాలు మొదలయ్యాక పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఉమాశంకర్‌కుమార్ బుధవారం విడుదుల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-కాకినాడ పోర్టు మధ్య ఆగస్టు 11 నుంచి 24 వరకు రెండు వైపులా కలిపి 28 సర్వీసులుంటాయి. తిరుపతి-కాకినాడ మధ్య ఆగస్టు 11 నుంచి 24 వరకు 28 సర్వీసులు, కాచిగూడ-కాకినాడ మధ్య ఆగస్టు 15 నుంచి 22 వరకు నాలుగు సర్వీసులు, తిరుపతి-విశాఖపట్నం మధ్య 12 నుంచి 19 వరకు నాలుగు సర్వీసులు, విజయవాడ-విశాఖపట్నం మధ్య 11 నుంచి 14, 18 నుంచి 21 వరకు 16 సర్వీసులు, హైదరాబాద్-గద్వాల మధ్య 11, 18 తేదీల్లో నాలుగు సర్వీసులుంటాయి. మణుగూరు-తెనాలి మధ్య 12 నుంచి 23 తేదీ వరకు 24 సర్వీసులు, విజయవాడ-ఒంగోలు మధ్య 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో 12 సర్వీసులు, హైదరాబాద్-గుంటూరు మధ్య 12 నుంచి 23 తేదీ వరకు 24 సర్వీసులుంటాయి. తిరుపతి-రాజమండ్రి మధ్య 14 నుంచి 21 వరకు రెండు వైపులా 10 సర్వీసులు, గుంతకల్-కృష్ణా మధ్య రెండు వైపులా 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో 12 సర్వీసులు, గుంతకల్-విజయవాడ మధ్య 12, 14, 16, 18, 20, 22 తేదీల్లో తిరుగుప్రయాణంలో 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో 12 సర్వీసులుం టాయి. సికింద్రాబాద్- గద్వాల మధ్య 12 నుంచి 23 వరకు 24 సర్వీసులు నడుస్తాయి. రైలు నెంబర్లు, సమయాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.


