2.12 శాతం లెస్తో మిడ్మానేరు టెండర్లు

2.12 శాతం లెస్తో మిడ్మానేరు టెండర్లు - Sakshi


రూ.323 కోట్లకు దక్కించుకున్న రాజరాజేశ్వరి-బెకామ్-ఎస్‌ఎమ్మెస్


 సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు రిజర్వాయర్ టెండర్ ప్రైస్‌బిడ్ గురువారం తెరుచుకుంది. రూ.323.45 కోట్ల పనులను రాజరాజేశ్వరి-బెకామ్-ఎస్‌ఎమ్మెస్ సంస్థ (జారుుంట్ వెంచర్) దక్కించుకుంది. 2.12 శాతం లెస్‌తో టెండర్ దాఖలు చేసి ఈ పనులను రాజరాజేశ్వరి సంస్థ దక్కించుకుంది. శ్రీరాంసాగర్ వరదకాల్వ కింద కరీంనగర్ జిల్లాలో 25.873 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 25న భారీ వర్షాలతో గండి పడిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో దీనిపై కొత్తగా టెండర్లు పిలవాలన్న సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు అక్టోబర్ 26న రూ.323.45 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించింది. ఈ పనుల కోసం రాజరాజేశ్వరి, మెగా సంస్థలు మాత్రమే పోటీలో నిలవగా, మెగా సంస్థ సాంకేతికంగా అర్హత సాధించకపోవడంతో మిగిలిన రాజరాజేశ్వరి సంస్థకు టెండర్ ఖరారైంది. ఈ టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌లను శుక్రవారం కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) పరిశీలనకు పంపుతున్నారు. వారంలో అగ్రిమెంట్‌ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ఆరంభించనున్నారు. 12 నెలల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


 తెరుచుకున్న ‘పాలమూరు’నెట్‌వర్క్ సర్వే టెండర్లు..

ఇక పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ (పిల్లకాల్వల వ్యవస్థ)సర్వేకు సంబంధించి సాంకేతిక టెండర్లు గురువారం తెరుచుకున్నారుు. పిల్ల కాలువల సర్వేకు సంబంధించిన రూ.92 కోట్లు విలువ చేసే పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా దీనికి పలు ప్రముఖ సంస్థలు పోటీపడ్డట్లుగా తెలిసింది. శుక్రవారానికి ఏయే ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయన్న అంశంపై స్పష్టత వస్తుందని, వారంలో ప్రైస్‌బిడ్‌లో తెరుస్తామని నీటి పారుదల వర్గాలు తెలిపారుు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top