
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ పదో తరగతి విద్యార్థిని కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.