మద్యం మత్తులో డ్రైవింగ్‌ వల్లే | 1 died due to rash driving in hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో డ్రైవింగ్‌ వల్లే

Mar 4 2017 4:39 PM | Updated on Sep 4 2018 5:07 PM

మూడురోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- ఒకరు మృతి
 
హైదరాబాద్‌: మూడురోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో బ్రిలియంట్ కాలేజీ విద్యార్థి వినయ్ గౌడ్ మృతి చెందటంతో పాటు మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప‍్రమాదానికి కారణమైన కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
 
కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండి నడపటం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజిని గమనించిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ప్రమాదకరంగా అతివేగంతో వాహనం నడిపినట్లు దర్యాప్తు తేలింది. వారిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి, కారును, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం వారిని రిమాండ్ కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement