ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యచేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని నేడు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గురువారం ఆత్మహత్యచేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
పొదలకూరు రోడ్డులోని లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చనున్నారు. అనంతపురంలో మునికోటి తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న రెండో వ్యక్తి లక్ష్మయ్య. కాగా, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హోదాను పోరాడి సాధించుకుందామని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.