breaking news
laxmaiah family
-
గంటన్నరసేపు ఏం మాట్లాడారు: వైఎస్ జగన్
-
గంటన్నరసేపు ఏం మాట్లాడారు: వైఎస్ జగన్
నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకు మంచి జరుగుతుందని ఎవరిని అడిగినా చెబుతారని, అలాంటిది చంద్రబాబు నాయుడు మాత్రం 'హోదా'పై మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, టీడీపీ కలిసి చేసిన వాగ్దానాల సంగతేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రావటం లేదని కలత చెంది నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు నాయుడు... ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయిన అనంతరం...ప్రత్యేక హోదాపై కేంద్రం నామమాత్రంగా కూడా ప్రకటన చేయలేదన్నారు. గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన చంద్రబాబు ఏంమాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ...ఐక్యంగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని ఆయన కోరారు. -
లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గురువారం ఆత్మహత్యచేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. పొదలకూరు రోడ్డులోని లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చనున్నారు. అనంతపురంలో మునికోటి తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న రెండో వ్యక్తి లక్ష్మయ్య. కాగా, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హోదాను పోరాడి సాధించుకుందామని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.