breaking news
nellore tour
-
రోప్పార్టీలపై ఎందుకీ దాగుడు మూతలు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది...మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్‌పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్‌లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్‌పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు. పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్‌పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా
వెంకటాచలం: ప్రతిపాదిత హెలిప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే... వాటిని పోలీసులు, అధికారులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు సూచించిన హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పూజిత తదితరులు మంగళవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్‌రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్ కోసం వైఎస్ జగన్ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం, పోలీసులు అంగీకరించడం లేదని తెలిపారు. చివరగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ విద్యుత్తు వైర్లు ఉన్న ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. అక్కడ రోడ్లు వేయాలన్నా, రెండు, మూడు రోజులు పడుతుందని, హెలికాప్టర్‌కు తిరిగి ఇంధనం నింపాలన్నా రేణిగుంట వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వేలాదిగా తరలివచ్చే వైఎస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత కల్పించడం లేదని తెలిపారు. ప్రాంతం, సాంకేతికంగా సమస్యలు ఉన్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశామని చెప్పారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తేదీని మళ్లీ నిర్ణయిస్తామని తెలిపారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు..
-
నెల్లూరులో జగన్ పై ఉన్న అభిమానం అంటే ఏంటో చూపిస్తా..
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
ఈ నగరమంటే నాకు చాలా ఇష్టం: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నవీన్ పోలిశెట్టి. తాజాగా నెల్లూరులో సందడి చేశారు. ఆయనను చూసిన అభిమానులు సైతం సెల్ఫీల కోసం ఎగబడ్డారు. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) పోలిశెట్టి మాట్లాడుతూ.. 'నా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ 80 శాతం నెల్లూరులోనే జరిగింది. ఇక్కడి ఫుడ్ సూపర్. నాకు ఎంతో ఇష్టం.' అని అన్నారు. నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పలువురు ఫుడ్ బ్లాగర్స్‌తో ముచ్చటించారు.అనంతరం మినీబైపాస్ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నవీన్ మాట్లాడారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ సమయంలో నగర వీధుల్లో తిరిగానని.. ఈ ప్రాంతం బాగా తెలుసన్నారు. ఇందులో హీరోయిన్గా అనుష్క నటించడం సంతోషంగా ఉందన్నారు. కథపై ఎంతో నమ్మకంతో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంజీబీ మాల్లో జరిగిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. Amazing craze for @NaveenPolishety at Nellore . Stand up promotional tour of #MissShettyMrpolishetty is getting a massive response . Today they are moving to Vijayawada. 6pm PVP Mall meet and greet with #NaveenPolishetty #MSMPStandupTour #MSMPonSep7th pic.twitter.com/1hzhrzKvEC — GSK Media (@GskMedia_PR) August 26, 2023 -
చంద్రబాబు రైతన్నలకు తీవ్ర అన్యాయం చేశారు: సీఎం జగన్
-
నెల్లూరు : కావలిలో జగనన్నకు అడుగడుగునా నీరాజనాలు.. (ఫోటోలు)
-
రూ.20 వేల కోట్ల విలువైన భూములపై సంపూర్ణ హక్కు: సీఎం జగన్
చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారు: సీఎం జగన్ ►రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు ►రిజిస్ట్రేషన్ 22(1)ఏ నుంచి డీనోటిఫై చేశాం ►భూములపై రైతులకు సర్వహక్కులు లభించాయి ►2,06,171 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు లభించాయి ►రూ.20 వేల కోట్ల మార్కెట్ విలువైన భూములకు సంపూర్ణ హక్కు ►దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి ►గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది ►చంద్రబాబు రైతులను కోలుకోని దెబ్బ కొట్టారు ►చంద్రబాబు హయాంలో భూములు అమ్ముకునే పరిస్థితి లేదు ►చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు ►వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు ఉంటుంది ►ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాం ►రైతన్నలందరికీ చుక్కల భూములపై పూర్తి హక్కు కల్పించాం ►రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నాను ►ఇప్పటికే గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం ►గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాం ►ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది ►ఇప్పటికే 2వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం ►భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నాం ►దేశంలో ఎక్కడా లేని విధంగా భూసర్వే చేస్తున్నాం ►ఈ నెల 20న 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం ►ఆర్బీకేల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందుబాటులోకి తెచ్చాం ►దళారీ వ్యవస్థ లేకుండా చేసి రైతులకు మేలు చేశాం ►గతంలో ఎన్నడూ జరగని మంచి ఇప్పుడు రైతులకు జరుగుతుంది ►నాలుగేళ్లుగా ప్రతి అడుగూ రైతన్నల కోసమే వేశాం ►రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు ►చంద్రబాబు, దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు ►వారికి తోడుగా రావణ సైన్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిలిచాయి ►రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ►బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తామని చెప్పి మోసం చేశారు ►రైతులను మోసం చేసిన పెద్ద మనిషిని ఒక్క మాట అడగరు ►ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించడమే మానేశారు ►ఎన్నికలు దగ్గరపడుతున్నందున వీళ్లంతా రోడ్డెక్కారు ►చంద్రబాబు స్క్రిప్ట్‌ను డైలాగ్లుగా మార్చిన ప్యాకేజీ స్టార్ ఒక వైపు.. ►బాబు, దత్తపుత్రుడి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లో మీడియా తానాతందానా ►డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా జమ చేశాం ►లంచాలు, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ►ప్రతి పేదవాడికి తోడుగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది ►చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే ►చంద్రబాబు ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి ►వీళ్ల విధానం డీపీటీ.. దోచుకో,పంచుకో, తినుకో ►జీవీరావు చార్టర్ అకౌంటెంట్ సర్వీస్ రద్దయింది ►ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపారు ►రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వద్దని, దివాలా తీస్తుందని చెప్పిస్తారు ►రామోజీ పురుగులు పట్టిన బుర్రలోంచి ఇలాంటి వారు పుడతారు ►చంద్రబాబు, ఎల్లో మీడియా మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తారు ►చంద్రబాబు, ఎల్లో మీడియాది పెత్తందారీ మనస్తత్వం ►వీళ్లు చేసే ప్రతి పని, ప్రతి మాట ప్రతి రాతలోనూ మోసం ►పేదలందరికీ ఇళ్లు ఇస్తుంటే వీళ్లందరికీ కడుపుమంట సీఎం జగన్ రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ♦చుక్కల భూములకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారు ♦దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు విముక్తి ♦నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములకు పరిష్కారం ♦ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది.. ఇది పేదల ప్రభుత్వం ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా కావలి చేరుకున్నారు. దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు సీఎం చెక్ పెట్టనున్నారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నారు. కాసేపట్లో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగుతుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలగనున్నాయి. ►వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ – ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. అవే చుక్కల భూములు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం వీరి కష్టాలను మరింత సంక్లిష్టం చేస్తూ అనాలోచితంగా ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు ఉండాలని నిర్ణయించారు. ►రైతులు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఈ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు లభించాయి. ►వారు వాటిని అమ్ముకొనేందుకు, రుణాలు పొందడానికి, తనఖాకు, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కలిగింది. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1902 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కాగా, సీఎం జగన్ శుక్రవారం ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన అషో్టత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞంలో పాల్గొంటారు. చదవండి: ప్రతిదానికి పిల్ ఏమిటి?.. టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టు అభ్యంతరం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం
-
విమానాశ్రయంలో జగన్‌కు ఘనస్వాగతం
-
విమానాశ్రయంలో జగన్‌కు ఘనస్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని, అనంతరం రొట్టెల పండుగలో కూడా పాల్గొంటారు. -
సీఎం పర్యటన నేడు
నెల్లూరు(క్రైమ్): ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఎస్పీ విశాల్‌గున్నీ భద్రతా ఏర్పాట్లపై తమ సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. సీఎం సెక్యూరిటీ అధికారి రాజారెడ్డి బుధవారం నెల్లూరుకు చేరుకొని ఎస్పీతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన హెలిప్యాడ్, దర్గా ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. సుమారు 2వేల మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిలో బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టాయి. బుధవారం రాత్రి ట్రయల్కాన్వాయ్ నిర్వహించారు. -
నెల్లూరు రొట్టెల పండుగకు వైఎస్ జగన్
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన భాగంలో నెల్లూరు బారా షహీద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగలో పాల్గొంటారు. ప్రతి యేటా ఇక్కడ నిర్వహించే రొట్టెల పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ పండుగకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. బారాషహీద్ దర్గాను దర్శించుకోవడంతో పాటు తమ కోరికల రొట్టెలను మార్చుకోవడం పండుగలో భాగంగా ఉంది. -
సీఎం పర్యటన నేడు
నెల్లూ(పొగతోట): సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం విజయవాడలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కలిగిరి మండలం పెద్దకొండూరు చేరుకుంటారు. 12.45 గంటలకు పెద్దకొండూరులోని జ్వాలముఖి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం పెద్దపాడు చేరుకుని ఉదయగిరి ఎమ్మెల్యే బీవీ రామరావు కుమారుడి వివాహ రిస్పెషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హెలికాప్టర్లో బయలుదేరివెళుతారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన కలిగిరి: మండలంలోని పెద్దపాడులో గురువారం జరగనున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు కుమారుని వివాహ రిసెప్షన్‌కి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ముత్యాలరాజు బుధవారం పెద్దపాడులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభావేదిక, పార్కింగ్ స్థలం, భోజన వసతులకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, కురుగుండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర రిసెప్షన్ ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట జేసీ ఇంతియాజ్, కావలి ఆర్డీఓ ఎంఎల్ నరసింహం, తదితరులు ఉన్నారు. -
లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గురువారం ఆత్మహత్యచేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. పొదలకూరు రోడ్డులోని లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చనున్నారు. అనంతపురంలో మునికోటి తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న రెండో వ్యక్తి లక్ష్మయ్య. కాగా, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హోదాను పోరాడి సాధించుకుందామని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.