ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత | tribal-killed-by-maoists-due-to-informer | Sakshi
Sakshi News home page

ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత

Jan 5 2016 1:50 PM | Updated on Oct 9 2018 2:51 PM

పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక గిరిజన యువకుడిని మావోయిస్టులు మంగళవారం మధ్యాహ్నం కాల్చిచంపారు.

విశాఖ: పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక గిరిజన యువకుడిని మావోయిస్టులు మంగళవారం మధ్యాహ్నం కాల్చిచంపారు. విశాఖపట్టణం జిల్లా మున్సంగిపుట్టు మండలం బూసిపుట్టు గ్రామానికి చెందిన శివయ్య(25) అనే యువకుడిని కాల్చిచంపారు. సరియపుట్టు గ్రామ శివారులో శివయ్య వెళుతుండగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మావోయిస్టులు కాల్చి హతమార్చారు. మావోలకు చెందిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో అతనిని చంపారని గ్రామస్తులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement