వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Feb 14 2016 1:29 PM | Updated on Sep 3 2017 5:39 PM

ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితులో మృతి చెందింది.

ఓ వివాహిత అనుమానాస్పద పరిస్థితులో మృతి చెందింది. భర్త, అతడి కుటుంబ సభ్యులే హతమార్చారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని మార్కెట్ కమిటీ సమీపంలో ఇస్లావత్ జ్యోతి (37) ఇంట్లో ఉరికి వేలాడుతుండగా ఆదివారం తెల్లవారుజామున గుర్తించారు.

  శ్రీనివాస్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులే జ్యోతిని హతమార్చారని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఏలూరు-చింతలపూడి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement