తిరుమలలో అనుమానితుల అరెస్ట్ | Suspects arrested in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో అనుమానితుల అరెస్ట్

Feb 14 2016 1:13 PM | Updated on Nov 6 2018 8:51 PM

తిరుమలలో ముగ్గురు అనుమానితులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

తిరుమలలో ముగ్గురు అనుమానితులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. రథసప్తమి సందర్భంగా కొంత మంది యువకులు అత్యాధునిక కెమెరాలతో ఊరేగింపు దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించి.. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.


కాగా.. ఓ ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా కోసం షూటింగ్ లో భాగంగా వీడియో తీస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు విజయవాడ ప్రాంతానికి చెందిన.. నిషాంత్ గా పోలీసులు గుర్తించారు. ఇతను చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నాడు.


అయితే.. తిరుమలలో సినిమా షూటింగ్ లను నిషేదిస్తూ.. గతంలోనే జీవో విడుల చేశారు. దీంతో పోలీసులు.. ఎదైనా సినిమా కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారా.. లేదా.. చిత్రీకరణ వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement