'కేసీఆర్ దుందుడుకు చర్యలు మానుకోవాలి' | Konda Raghava Reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ దుందుడుకు చర్యలు మానుకోవాలి'

Jul 24 2015 12:26 PM | Updated on Aug 15 2018 9:27 PM

'కేసీఆర్ దుందుడుకు చర్యలు మానుకోవాలి' - Sakshi

'కేసీఆర్ దుందుడుకు చర్యలు మానుకోవాలి'

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విద్యార్థిని ప్రాణం తీసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విద్యార్థిని ప్రాణం తీసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి స్పందించాలన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుందుడుకు చర్యలు ఆపి ఆచరణ సాధ్యమయ్యే హామీలు చేసేందుకు దృష్టి సారించాలని సూచించారు.

హైకోర్టు నుంచి నోటీసులు రాకముందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేసీఆర్కు కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. లేకుంటే వారిని బర్త్రఫ్ చేయాలన్నారు. దీనిపై కేసీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement