'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ' | Gutta Sukender Reddy takes on trs government | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ'

Dec 4 2015 10:12 AM | Updated on Sep 3 2017 1:29 PM

'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ'

'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ'

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త శాఖను ఏర్పాటు చేశారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.

నల్గొండ : అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఆ శాఖ బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్రెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. శుక్రవారం నల్గొండలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ...  తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్పై మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు రాకుండా చేశామని చెబుతున్న టీఆర్ఎస్... ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలను కలుపుకుని పోతామని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement