కాల్‌మనీ కేసులో బుద్దా వెంకన్న సోదరుడికి బెయిల్ | Bail to buddha venkanna brother in the case of call money | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ కేసులో బుద్దా వెంకన్న సోదరుడికి బెయిల్

Dec 19 2015 5:19 AM | Updated on Sep 3 2017 2:12 PM

కాల్‌మనీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావుకు వన్‌టౌన్ పోలీసులు

వన్‌టౌన్ (విజయవాడ): కాల్‌మనీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావుకు వన్‌టౌన్ పోలీసులు గురువారం స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వన్‌టౌన్ పోలీసులు బుద్దా నాగేశ్వరరావు కేసును చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి.. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని, కోర్టులో ఎందుకు పెడుతున్నారని అంటూ కేసును రిటర్న్ చేశారు. దాంతో వన్‌టౌన్ పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదించారు. అనంతరం నాగేశ్వరరావుకు స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement