12న ‘నిజాం’ మైదానంలో దావత్-ఎ- ఇఫార్త్ | Arrangements On Review conducted by the Deputy Chief Minister Mohammed Ali | Sakshi
Sakshi News home page

12న ‘నిజాం’ మైదానంలో దావత్-ఎ- ఇఫార్త్

Jul 10 2015 1:35 AM | Updated on Sep 3 2017 5:11 AM

ప్రభుత్వం ఈ నెల 12న నిజాం కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రంజాన్ దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమానికి ఏర్పాట్లను...

ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఈ నెల 12న నిజాం కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రంజాన్ దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమానికి ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఇఫ్తార్‌కు ఎలాంటి  ఆటంకాలు కలుగకుండా చూడాలని, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

రంజాన్ కానుకగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త దుస్తుల పంపిణీ కార్యక్రమానికి మసీదు కమిటీలు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని రెండు లక్షల మంది నిరుపేదలకు రూ.10 కోట్ల విలువైన బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.    ఈనెల 15లోగా బట్టలు పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్, ప్రొటోకాల్ కార్యదర్శి వికాస్‌రాజ్, డెరైక్టర్ అరవింద్ సింగ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ జలాలుద్దీన్ అక్బర్, రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ అధికారి ఎస్‌ఎం షుకూర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement