 
															మాధురి దీక్షిత్ ...  శివరాజ్ సింగ్ చౌహాన్...
													 
										
					
					
					
																							
											
						 మహిళలకు ప్రేరణనిచ్చేందుకు, స్త్రీశిశు హత్యలను నివారించే విషయంలో అవగాహన కల్పించేందుకు మాధురీ దీక్షిత్ సేవలను ఉపయోగించుకుంటున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
						 
										
					
					
																
	ఏ ముహూర్తాన గుజరాత్ టూరిజంను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ అమితాభ్ ను తీసుకొచ్చారో కానీ ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రులు తమ పథకాల ప్రచారం కోసం సినీ స్టార్ల వెంట పడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చేరారు. 
	 
	ఆడపిల్ల సంరక్షణ కోసం, గర్భిణీ స్త్రీల మరణాలు, భ్రూణ హత్యలను అరికట్టేందుకు ఆయన మమతా అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని యూనిసెఫ్ సాయంతో నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారం కోసం ఆయన బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను రంగంలోకి దించారు. 
	 
	గురువారం ఈ పథకాన్ని భోపాల్ లో మాధురి దీక్షిత్ ప్రారంభించారు. ఆమె ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు. మహిళలకు ప్రేరణనిచ్చేందుకు, స్త్రీశిశు హత్యలను నివారించే విషయంలో అవగాహన కల్పించేందుకు మాధురీ దీక్షిత్ సేవలను ఉపయోగించుకుంటున్నామని ఆయన అన్నారు.