వారఫలాలు (28 జనవరి నుంచి 3 ఫిబ్రవరి 2018 వరకు)

varaphalalu inthis week - Sakshi

28 జనవరి నుంచి 3 ఫిబ్రవరి 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ ఎదురవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. అనారోగ్య సూచనలు. దేవాలయ దర్శనాలు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులు ఆపద్బాంధువులుగా ఆదుకుంటారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన పురోభివృద్ధి. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. అనుకున్నది పట్టుదలతో  సాధిస్తారు. కార్యసిద్ధి. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. మిత్రులతో వివాదాలు తీరతాయి. అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు  లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో ధనవ్యయం. సోదరులతో స్వల్ప వివాదాలు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పరపతి పెరుగుతుంది. సోదరులు, సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవర్తమానాలు అందుకుంటారు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి. కళాకారులకు పురస్కారాలు. వారం  చివరిలో వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. వ్యాపారులకు లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.  పారిశ్రామికవర్గాలకు విదేశీయానం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో తగాదాలు తీరతాయి. మీ ౖ¯ð పుణ్యం వెలుగులోకి వస్తుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం. ఎరుపు, లేత గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఇంటిలో విందువినోదాలు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దాపరికాలు లేకుండా మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు . చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి., ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో  ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు కొంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలితమిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు సన్మానాలు, ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందçర్శిస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో  దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. లేత నీలం, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు నిదానంగా సాగుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు. కలహాలు. శ్రమాధిక్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకుతెచ్చుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కే ఛాన్స్‌. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో
28 జనవరి నుంచి  3 ఫిబ్రవరి, 2018 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. వృత్తి జీవితం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న గుర్తింపు, గౌరవం రానున్న రోజుల్లో లభిస్తాయి. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం దక్కుతుంది. జీవితమంతా ఒకదగ్గర ఆగిపోయి ముందుకు కదలడం లేదన్న మీ ఆలోచనలు మిమ్మల్ని ఆశయసాధనకు దూరం చేస్తాయన్న విషయాన్ని బలంగా నమ్మండి. ఆర్థిక పరిస్థితి కాస్తంత అయోమయంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : తెలుపు 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈవారం కూడా ఎప్పట్లానే కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయిన భావన మిమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నట్లైతే, దానికి కారణం ఏమై ఉంటుందన్నది విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది. వృత్తి జీవితంలో మీ పైస్థాయి వ్యక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ   వైపునుంచి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా ఉండండి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నింటికీ నిలబడితే రానున్న రోజుల్లో మీకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితమంటే భయపడిపోయే మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన సమయం వచ్చింది. మీ భయాలన్నింటినీ దూరం చేసుకొని, మీ శక్తినంతా కూడదీసుకొని పనిచేయండి. విజయం మీవైపే ఉందన్న విషయాన్ని బలంగా నమ్మి పనిచేయండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. వాళ్లు అలా ఎందుకు మారారన్న విషయాన్ని వాళ్ల కోణంలోకి వెళ్లి ఆలోచించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తీసుకునే ఆహారం, నిద్ర సమయాల్లో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. అన్ని పనులూ ఒకేసారి మీద పడడంతో కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు. ఇంటికి వెళ్లిపోయో, విహారయాత్రకు వెళ్లిపోయో ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఈ నెల్లోనే మీ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి రాక మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ ఇష్టాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
చాలాకాలంగా మీరు చేపట్టిన పనులన్నీ ఒకే దగ్గర ఆగిపోయాయన్న ఆలోచనలో పడిపోతారు. అయితే జీవితమంటే ఇలాగే ఉంటుందని, ఒక అవకాశం చేజారితే, మరొకటి ఏదో వస్తుందని మీరు నమ్మాలి. ఏదీ ముందుకు వెళ్లట్లేదన్న మీ ఆలోచనే మిమ్మల్ని కొన్ని విజయాలకు దూరంగా తీసుకెళుతోందని తెలుసుకోండి. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ వ్యక్తికి ఊహించని రీతిలో అతి తక్కువ కాలంలోనే దగ్గరైపోతారు. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉంటేనే మంచిదని తెలుసుకోండి. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
జీవితాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత చక్కగా ఆ జీవితం మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని నమ్మండి. ఏది జరిగినా మంచికే అన్న తత్వాన్ని అర్థం చేసుకుంటే రాబోయే రోజులను సంతోషంగా గడుపుతారు. కొన్ని కొత్త అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. అయితే ఆ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరేం చేయాలో తెలుసుకోండి. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలు కూడా చక్కబడతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం ఓ కీలక మలుపుకు నాంది పలుకుతుందన్న విషయాన్ని నమ్మండి. మీరు చేయలేని పనంటూ ఏదీ లేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని దూరం చేసుకుంటే, చివరకు మీకు మిగిలేది ఏదీ ఉండదని గ్రహించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్లండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి కొన్ని విషయాల్లో మీకు విసుగు తెప్పిస్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించండి. 
కలిసివచ్చే రంగు : గులాబి 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బందిపెడుతోన్న సమస్యలన్నీ ఇప్పుడే సద్దుమణుగుతాయి. ఒక కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమవండి. కొత్త అవకాశాలు వచ్చిపడతాయి. మీలో ఊహించని మార్పులు తీసుకొచ్చే ఓ వ్యక్తి పరిచయమవుతారు. ఆ వ్యక్తితో పరిచయం ప్రేమవరకూ వెళుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రతికూల ఆలోచనలన్నీ దూరం చేసుకొని విజయంపై ధీమాతో పనిచేస్తూ ముందుకెళ్లండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారమంతా మీకు కాస్తంత గందరగోళంగానే ఉంటుంది. ముఖ్యంగా చేపట్టిన పనులేవీ ముందుకు వెళుతున్నట్టు కనిపించవు. ఇదంతా మీ ఆలోచనా విధానంలో ఉన్న లోపాల వల్లే అని తెలుసుకోండి. ఇప్పటికైనా ఆ ఆలోచనా విధానం ఎలా మారాలన్నది గ్రహించి పనిచేయండి. గతాన్ని ఎక్కువగా తల్చుకుంటే అదే మీ పతనానికి దారితీస్తుందని తెలుసుకోండి. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఓ అవకాశం మీకు దగ్గరగా వచ్చి ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : వయలెట్‌ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొద్దికాలంగా మిమ్మల్ని వెంటాడుతోన్న సమస్యలు ఈవారమూ అలాగే ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు ఇంకొద్దిరోజులు మాత్రమే ఇలా ఉంటాయన్న విషయాన్ని బలంగా నమ్మండి. మీ చుట్టూ ఉండేవాళ్లే కొన్నిసార్లు మీ పతనానికి కారణమవుతున్నారన్నది గ్రహించి వారితో జాగ్రత్తగా ఉండండి. కొద్దినెలల క్రితం మొదలుపెట్టి, మధ్యలోనే ఆపేసిన ఓ పనిని ఇప్పుడు కొత్తగా మొదలుపెడతారు. ఇది తప్పకుండా మీరు కోరుకున్న విజయాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త వ్యక్తి పరిచయం మీ జీవితానికి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
కొన్నాళ్లుగా.. చేపట్టిన ఏ పనీ ముందుకు కదలడం లేదన్న భావన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ముందు ఆ ఆలోచన నుంచి బయటకొచ్చి మీదైన శక్తినంతా వెచ్చించి పనిచేయండి. అన్ని చెడు ఆలోచనలను దూరం చేసుకొని బయటకొచ్చే రోజు త్వరలోనే వస్తుంది. ఆరోజు కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీకు బాగా ఇష్టమైన వ్యక్తితో చిన్న చిన్న గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. 
కలిసివచ్చే రంగు : కాషాయం

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మీ గమ్యమేంటో, అందుకు మీరేం చేయాలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి వస్తుంది. సరైన పద్ధతిలో ఆ ఆలోచనను విస్తరిస్తే అది మీకు బాగా ఉపయోగపడుతుందని నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. భయాలను వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : బూడిద 
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top