వారఫలాలు

Varafhalalu in this week - Sakshi

4 నవంబర్‌ నుంచి 10 నవంబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది.  ముఖ్యమైన పనుల్లో విజయం. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం.  ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు.  పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  చివరిలో ధనలబ్ధి. వాహనయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు.  ఏ పని చేపట్టినా ముందుకు సాగక డీలా పడతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.  వారం ప్రారంభంలో స్వల్ప ధనలబ్ధి. తెలుపు, ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళపరుస్తుంది. మిత్రులతో అకారణంగా వివాదాలు.  కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. మిత్రులు సైతం శత్రువులుగా మారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి.  గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు, రుణయత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. కాంట్రాక్టర్లు అవకాశాలు చేజార్చుకుంటారు.  వ్యాపారాలలో స్వల్ప లాభాలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. శుభకార్యాల నిర్వహణ. ధనలబ్ధి. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులు అన్నివిధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.  వారం మధ్యలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు.  వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. పనులలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతారాలు.  చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకించడం నిరాశ పరుస్తుంది. ఒక సమాచారం నిరుద్యోగులకు కాస్త ఊరటనిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు. కళారంగం వారికి అవకాశాలు చేజారవచ్చు. వారం చివరిలో విందువినోదాలు. భూ, వస్తులాభాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. విద్యార్థులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(4 నవంబర్‌ నుంచి 10 నవంబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. వ్యాపార పారిశ్రామిక వర్గాల్లోని వారు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల పెద్దస్థాయి ఒడంబడికలను కుదుర్చుకుంటారు. లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ప్రేమానుబంధాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. అలంకరణలపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
 కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులను చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. త్వరలోనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. పనితీరు ద్వారా పొందిన గుర్తింపు వల్ల తేలికగానే మంచి అవకాశాలను అందుకుంటారు. అసంతృప్తికర వాతావరణం నుంచి త్వరలోనే బయటపడతారు. ఇంటిని కొత్తగా అలంకరిస్తారు. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల నుంచి కీలక సాయం పొందుతారు. మీపై వదంతుల వ్యాప్తికి కారణమైన వ్యక్తులను గుర్తిస్తారు. దైవాన్ని నమ్ముకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనుభవాల ద్వారా పాఠాలు నేర్చకుంటారు. జీవితం పట్ల ఇప్పటి వరకు ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటారు. తెలివిగా వ్యవహరించి హానికరమైన పరిస్థితులు ఎదురవకుండా చూసుకుంటారు. సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
లక్కీ కలర్‌: నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అకుంఠిత దీక్షతో చేసిన కృషి వల్ల అసాధారణ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంపదను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు సాధించే సూచనలు ఉన్నాయి. కోరుకున్న పదవులను దక్కించుకోగలుగుతారు. కొత్తగా తలపెట్టిన పనులను ప్రారంభించడానికి ఇది పూర్తిగా అనువైన కాలం. ప్రేమ ప్రతిపాదన ఫలప్రదమవుతుంది. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. బరువును అదుపు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. శుభవార్తలు సంతోషాన్నిస్తాయి.
లక్కీ కలర్‌: నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
క్షణికావేశాన్ని నియంత్రించుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. పని ప్రదేశంలో చిన్న చిన్న మార్పులు చేపడతారు. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసి చూపిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శిస్తారు.
లక్కీ కలర్‌: లేత గోధుమరంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
గతం చేసిన గాయాల నుంచి తేరుకుంటారు. సానుకూల ఫలితాలను ఇచ్చే సరికొత్త దిశలో ముందుకు సాగుతారు. అయితే, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. పనిలో సత్తా చాటుకుంటారు. గడ్డు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. స్థిరాస్తి లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం సమకూరే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. 
లక్కీ కలర్‌: ఇటుక రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
తిరుగులేని పట్టుదలతో అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. కృతనిశ్చయంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న స్థాయిని మించి ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సుదూర యాత్రలకు వెళతారు. అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తారు. సత్యాన్వేషణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సంకల్పిస్తారు.
లక్కీ కలర్‌:  తెలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. విజయోత్సాహంతో ముందుకు సాగుతారు. ఊపిరిసలపని పనితో ఉక్కిరిబిక్కిరవుతారు. వరుస విజయాలతో అలసటను మరచిపోతారు. మీ పురోగతిలో పెనువేగానికి సన్నిహితులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటమే మంచిది. ఘర్షణ తలెత్తినప్పుడు మొండితనానికి పోకుండా, పట్టు విడుపు ధోరణితో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మందగించవచ్చు..
లక్కీ కలర్‌: ఊదా

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఇంటా బయటా మార్పులు చేపడతారు. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి మార్పులు, పరిహారాలు చేపడతారు.  పనుల పురోగతిలో వేగం పుంజుకుంటుంది. మీ జీవితంలో అద్భుతమైన కాలం మొదలైనట్లే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వచ్చిన కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.
లక్కీ కలర్‌: లేత బూడిదరంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఎంతోకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛా స్వతంత్రాలను మనసారా ఆస్వాదిస్తారు. మనస్సాక్షిని నమ్ముకుంటారు. మీ తీరు కొందరికి నచ్చకున్నా, మీదైన మార్గంలోనే ముందుకు సాగుతారు. సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల సాధనలో కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా నాయకత్వ పాత్ర పోషిస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు.
లక్కీ కలర్‌: నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో బంధు మిత్రులతో విందు వినోదాలను ఆస్వాదిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. మనసైన వ్యక్తి ముందు మీ మనసులోని మాటను వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ప్రతి అంశంలోనూ సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా శాంతి సామరస్యాల కోసం పరితపిస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. అదనపు ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అసూయాపరులు మిమ్మల్ని తప్పుడు సలహాలతో తప్పుదారి పట్టించే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నట్లయితే అలాంటి వారి ఉచ్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: బూడిదరంగు
-ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top