వారఫలాలు | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Nov 25 2018 2:33 AM

Varafalalu in this week 25 nov 2018 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఈవారం మౌనం మంచిది. మిత్రులేææ శత్రువులుగా మారతారు. నిరుద్యోగుల యత్నాలలో అవరోధాలు. చేపట్టిన  పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేతికందవలసిన డబ్బు కొంత ఆలస్యమై అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులు, బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాల్లో మార్పులు అనివార్యం. రాజకీయవర్గాలకు చికాకులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి కాగలవు. మీ నిర్ణయాలను కుటంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు ఎదురవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి, అప్రమత్తత అవసరం. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో  మరిన్ని బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో విందువినోదాలు. ధన,వస్తులాభాలు. నూతన విద్యావకాశాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక అవసరాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కుటుంబసభ్యుల ఆదరణ చూరగొని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాలు పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాల్లో హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు.అనుకోని ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడతారు. మిత్రులతో అకారణంగా విభేదాలు. తరచూ నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నిరుద్యోగులు, విద్యార్థుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి,లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి లబ్ధి పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో అంది సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల అభిమానాన్ని పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో  అనుకూల స్థితి. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీయానం. వారం మధ్యలో కుటుంబంలో చిక్కులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అందరిలోనూ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. గృహ నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభ సూచనలు. ఒక దీర్ఘకాలిక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో  కొత్త హోదాలు. కళాకారులు అప్రయత్నంగా అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో మిత్రులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు.  ప్రముఖుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు సైతం అనుకూలంగా మారి సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మీ కృషికి కుటుంబసభ్యులు సహకరిస్తారు. వ్యాపారాలలో  కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో  ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆప్తులతో కలహాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై ్రÔ¶ ద్ధ చూపండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. రాజకీయవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం చివరిలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాల కొనుగోలులో అవాంతరాలు. వేడుకల నిర్వహణలో జాప్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి నిరుత్సాహం, విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు  కార్యసాధకులై సత్తా చాటుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు  సంతృప్తికరంగా ఉంటాయి. అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతికి అర్చన చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. మీ ఆకాంక్షలు నెరవేరే సమయం. చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు.  శుభకార్యాలతో హడావుడిగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ప్రారంభంలో అనారోగ్యం,  కుటుంబంలో సమస్యలు. తూర్పుదిశ  ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విరో«ధాలు. ఇంటాబయటా వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది, తద్వారా వైద్యసేవలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. మీ నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తారు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాల కోసం మరింత కృషి చేయాలి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ధనలాభం. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. కొత్తగా పుంజుకున్న జవసత్త్వాలతో సవాళ్లను స్వీకరిస్తారు. ధైర్య సాహసాలతో ప్రతికూలతలను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ఊహించని రీతిలో కఠినమైన లక్ష్యాలను అలవోకగా సాధించి అధికారుల ప్రశంసలు పొందుతారు. సామాజికంగా పరపతిని పెంచుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామికి కానుకలు ఇస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. దైవానుగ్రహం అనుకూలంగా ఉంది.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అంచనాలకు మించిన శుభఫలితాలు ఉంటాయి. జీవితం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీలోని సద్గుణ సంపద, ఔదార్యం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉంటాయి. అవసరంలో ఉన్న ఒక మిత్రుని ఆదుకుంటారు. ఇతరుల ఆనందం కోసం తపిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారరంగంలోని వారికి కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇంటికి, కార్యాలయానికి కొత్తగా అలంకరణలు చేపడతారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
వాక్చాతుర్యంతో జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. సామాజిక బృందాల్లో మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహచరులు మీ సలహాలను కోరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడే ఒక గొప్ప అవకాశం కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. సామాజిక అంశాలపై మీకు గల నిశ్చితాభిప్రాయాలు మీ గౌరవాన్ని పెంచేవిగా ఉంటాయి. ఆశించిన ఫలితాల కోసం అహరహం కృషి చేస్తారు. క్రమశిక్షణతో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. సుదూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
లక్కీ కలర్‌: నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలిగే కొత్త అవకాశం వస్తుంది. వ్యాపార రంగంలో అనూహ్యమైన లాభాలు వస్తాయి. ప్రేమికుల నడుమ అనుబంధం మరింతగా పెనవేసుకుంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయారా అన్నంతగా ప్రేమానురాగాలను ఆస్వాదిస్తారు. పని ఒత్తిడికి దూరంగా కొంత విరామం తీసుకుంటారు. విహారయాత్రలకు వెళతారు. సృజనాత్మక రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు కలసి వస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడిస్తాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
చిరకాల లక్ష్యాన్ని సాధిస్తారు. కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మరో మెట్టు పైకెదుగుతారు. సవాళ్లను స్వీకరిస్తారు. విజయపథంలో ముందుకు దూసుకుపోతారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలకు సంబంధించి జీవిత భాగస్వామితో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విమర్శకుల వ్యాఖ్యలకు మాటలతో కాక చేతలతోనే బదులు చెబుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆధ్యాత్మికమార్గంలో పురోగతి సాధిస్తారు.
లక్కీ కలర్‌: పసుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మానసికంగా మరింత దృఢనిశ్చయంతో ముందుకు సాగుతారు.. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఘనవిజయాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది.
లక్కీ కలర్‌: లేత పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: తెలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: ఊదా

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్‌: లేతనీలం
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement