వారఫలాలు

Varafalalu in this week 18 nov 2018 - Sakshi

18 నవంబర్‌ నుంచి 24 నవంబర్‌ 2018 వరకు 

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలు కొంత మందగిస్తాయి కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తత పాటించాలి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి మీ సమర్థతకు సవాలుగా మారతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు.  విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీస్థాయి పెరుగుతుంది. క్లిష్టసమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఊహించని విధంగా ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భూ, వాహనయోగాలు. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత గులాబీ రంగులు. ఉత్తరదిశæ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. అనుకున్న పనుల్లో జాప్యం. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. శ్రమపడ్డా తగినంత ఫలితం లేక  నిరాశ చెందుతారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. భాగస్వాములతో వివాదాలు. వారం చివరిలో విందువినోదాలు. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. నిరుద్యోగులు అవకాశాలు చేజార్చుకుంటారు. కొన్ని పనులు మధ్యలోనే నిలిపివేస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. భూములు, గృహం కొనుగోలులో అవాంతరాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అన్నివిధాలా అనుకూలమైన కాలం. ఆర్థికంగా గతం కంటే పురోభివృద్ధి సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. భూలాభాలు కలుగుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని కేసులు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వాహనయోగం. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి.  ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సోదరులతో ఆస్తుల వ్యవహారంలో కొద్దిపాటి వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి, అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. కొత్త వ్యక్తుల పరిచయం. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సూచనలు. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ మరింత పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఉద్యోగలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సన్నిహితులతో విభేదాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులను కలుసుకుని కుటుంబ వ్యవహారాలపై చర్చిస్తారు. విద్యావకాశాలు చేజారి విద్యార్థులు నిరాశ చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ప్రత్యర్థులు మీపై ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు అందవచ్చు. వారం మధ్యలో ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. పసుపు, ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. లక్ష్మీధ్యానం చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులుకోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు ప్రస్తావిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబసభ్యులతోవిభేదాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలు, వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి విశేష గుర్తింపు, సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (18 నవంబర్‌ నుంచి  24 నవంబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ధ్యానంతో ఊరట పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. 
లక్కీ: లేత పసుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. 
లక్కీ కలర్‌: ముదురు గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు. గడచిన సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విజయాలకు కారకులు మీరే అయినా, ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలనుకుంటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడికి, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వ్యాయామం కొనసాగిస్తారు. వైద్యుల సలహాతో ఆహార అలవాట్లలో మార్పులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: కెంపురంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఇంటా బయటా వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. ఒక కఠోర వాస్తవం మీ కలల సౌధాన్ని కుప్పకూల్చేసే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్లుగానో నిలుపుకున్న ఆశలు చెల్లాచెదురు కావడంతో బాగా కలత చెందుతారు. వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు. శక్తులు కూడదీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలసివస్తాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులు తలపెడతారు. సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. 
లక్కీ కలర్‌: ముదురు పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. 
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. నాయకత్వ పాత్రలో మీ దార్శనికత ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పథకాలను ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు. పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రియతములతో విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: తెలుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వ్యక్తిగత అంశాలు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి. మరింత క్రియాశీలంగా ఆలోచిస్తారు. ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు. భయాన్ని పూర్తిగా జయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు. విజయాలు సాధిస్తారు. పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఇతరులు మీ సలహాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని విహార యాత్రలకు వెళతారు. దేవాలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: లేత గులాబి 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top