వారఫలాలు

Vaara phalalu 17-02-2019 - Sakshi

17 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి 2019 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యూహాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కొంత సహకరించకపోయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆశయాలు సాధనలో మిత్రులు చేయూతనిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సంస్థల ఏర్పాటులో నిమగ్నమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకూ గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వాహనయోగం. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారాలు సమతూకంగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృధా ధనవ్యయం. అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా అవసరాలు తీరతాయి. ఆప్తులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.  పనులు ముందుకు సాగక డీలా పడతారు.  మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలలో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. విందువినోదాలు. గులాబీ, లేతఆకుపచ్చ, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విదేశీ విద్యావకాశాలు దక్కే సూచనలు. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వ్యతిరేకులను కూడా మీవైపునకు ఆకర్షిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. గృహం కొనుగోలు, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు కలసివస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. çవాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం.  తీర్థయాత్రలు చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మ«ధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.  స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. చర్చల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోతగిన మార్పులు కనిపించవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అవసరాలకు లోటు రాదు. ఆప్తులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  ఆస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి.   వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు సైతం అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. భూములకు సంబంధించిన కొన్ని అగ్రిమెంట్లు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. సోదరులతో సఖ్యత. వ్యాపార లావాదేవీలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలయత్నాలు సఫలం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావుజ్యోతిష్య పండితులు

టారో

17 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి 2019 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అనుకోని అవకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సకాలంలో సహాయం పొందుతారు. ధ్యానంతో ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలకు వెళతారు.
లక్కీ: లేత పసుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. 
లక్కీ కలర్‌: ముదురు గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు. గడచిన సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విజయాలకు కారకులు మీరే అయినా, ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలనుకుంటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడికి, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వ్యాయామం కొనసాగిస్తారు. వైద్యుల సలహాతో ఆహార అలవాట్లలో మార్పులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: కెంపురంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఇంటా బయటా వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. ఒక కఠోర వాస్తవం మీ కలల సౌధాన్ని కుప్పకూల్చేసే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్లుగానో నిలుపుకున్న ఆశలు చెల్లాచెదురు కావడంతో బాగా కలత చెందుతారు. వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు. శక్తులు కూడదీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలసివస్తాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులు తలపెడతారు. సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. 
లక్కీ కలర్‌: ముదురు పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. 
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. నాయకత్వ పాత్రలో మీ దార్శనికత ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పథకాలను ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు. పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రియతములతో విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: తెలుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వ్యక్తిగత అంశాలు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి. మరింత క్రియాశీలంగా ఆలోచిస్తారు. ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు. భయాన్ని పూర్తిగా జయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు. విజయాలు సాధిస్తారు. పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఇతరులు మీ సలహాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని విహార యాత్రలకు వెళతారు. దేవాలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: లేత గులాబి
 ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top