చిటికెలో చపాతీలు రెడీ | Ready snap chapatis | Sakshi
Sakshi News home page

చిటికెలో చపాతీలు రెడీ

May 22 2016 2:27 AM | Updated on Sep 4 2017 12:37 AM

చిటికెలో చపాతీలు రెడీ

చిటికెలో చపాతీలు రెడీ

చపాతీలు తయారు చేయడానికి ఏం చేస్తారు చెప్పండి.. ముందుగా పొడిపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసుకుంటాం.

కొత్తకొత్తగా
చపాతీలు తయారు చేయడానికి ఏం చేస్తారు చెప్పండి.. ముందుగా పొడిపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసుకుంటాం. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పీటపై చపాతీ కర్రతో వాటిని పల్చగా ఒత్తుకుంటాం. ఆపైన స్టౌపై పెనం పెట్టి, కొద్దిగా నూనెను వేసుకుంటూ కాల్చుకుంటాం.. అవునా..! ఇదంతా చేయడానికి మనకు అరగంటకు తగ్గకుండా సమయం కావాల్సిందే. కానీ, ఈ పనులన్నీ నేను నిమిషాల్లో చేసేస్తానంటోంది ‘రోటీమేటిక్’. పక్కన ఫొటోలో కనిపిస్తున్నదే ఈ రోటీమేటిక్...

ఈ మిషన్‌కి పైన కనిపిస్తున్న మూడు అరల్లో పొడిపిండి, నూనె, నీళ్లు పోయాలి. తర్వాత మిషన్‌ను ఆన్ చేయాలి. అంతే ఒకేసారి 15 చపాతీలను తయారుగల సామర్థ్యం దీనికుంది. ఈ రోటీమేటిక్‌ను శుభ్రం చేసుకోవడం కూడా చాలా సులువు.. ఎందుకంటే దీని భాగాలను విడివిడిగా తీసి శుభ్రం చేసి మళ్లీ అమర్చుకోవచ్చు. ఇదింత చక్కగా మన శ్రమను తగ్గిస్తుంటే.. దీన్ని ఎవరైనా ఎందుకు ఇష్టపడరు చెప్పండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement