అరుదైన పక్షి అర్కిటిక్ టెర్న్ | Rare Bird Arctic Tern | Sakshi
Sakshi News home page

అరుదైన పక్షి అర్కిటిక్ టెర్న్

Apr 19 2015 1:03 AM | Updated on Sep 3 2017 12:28 AM

అరుదైన పక్షి అర్కిటిక్ టెర్న్

అరుదైన పక్షి అర్కిటిక్ టెర్న్

సృష్టిలో అత్యంత సుదీర్ఘమైన దూరం వలస వెళ్లే పక్షి అర్కిటిక్ టెర్న్...

ప్లే టైమ్
సృష్టిలో అత్యంత సుదీర్ఘమైన దూరం వలస వెళ్లే పక్షి అర్కిటిక్ టెర్న్. 28 నుంచి 39 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ పక్షి రెక్క చాచితే దాదాపు 75 సెంటీమీటర్లుంటుంది. ఆహారం కోసం, సంతానోత్పత్తిలో భాగంగా పొదగడం కోసం ఈ జాతి పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ జాతి పక్షులు ఆర్కిటిక్ ఉత్తర భాగంలోని గ్రీన్‌లాండ్ నుంచి అంటార్కిటికాలోని వెడెల్ సీ వరకూ ప్రయాణిస్తాయి. అంటే దాదాపు 90 వేల కిలోమీటర్లన్నమాట!

ఇప్పటి వరకూ గుర్తించిన పక్షుల వలసల్లో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఇదే. ఈ పక్షి దాదాపు 30 యేళ్ల పాటు జీవిస్తుంది. ఆహారం కోసం సముద్రాల మీదే ఆధారపడుతుంది. చేపలను ఇష్టంగా భుజిస్తుంది. వలస విషయంలో అరుదైన శక్తి ఉన్న ఈ పక్షి జాతి అంతరిస్తున్న జాతుల్లో ఒకటిగా ఉండటం ఆందోళనకరమైన పరిణామం.

Advertisement
 
Advertisement
Advertisement