మేఘాల్లో మీటింగ్! | Comedy Scene - yamalila | Sakshi
Sakshi News home page

మేఘాల్లో మీటింగ్!

Jun 14 2015 12:04 AM | Updated on Sep 2 2018 3:44 PM

మేఘాల్లో మీటింగ్! - Sakshi

మేఘాల్లో మీటింగ్!

నరకంలో యముడు అంటే అందరికీ హడల్. అలాంటి యముడు చిత్రగుప్తునితో కలసి భూలోకానికి వస్తాడు.

నరకంలో యముడు అంటే అందరికీ హడల్. అలాంటి యముడు చిత్రగుప్తునితో కలసి భూలోకానికి వస్తాడు. కానీ మనోళ్లకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఇంతలో చిత్రగుప్తుని పాపాల చిట్టా మిస్సింగ్. అది దొరికితే గాని పాపులను శిక్షించడానికి కుదరదు. చిత్రగుప్తుడు రకరకాల గెటప్స్‌లో దాని గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ దొరకదు. ఇక డెరైక్ట్‌గా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తాడు. నగర పౌరుల శ్రేయస్సే భాగంగా పనిచేసే ఎస్‌ఐ రంజిత్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికెళ్లి, చిత్రగుప్తుడు ఏం ఫిర్యాదు చేశాడో చూడండి!
 చిత్రగుప్తుడు: అయ్యా! నా పుస్తకం పోయిందండీ!
 
 ఎస్‌ఐ: ఎక్కడ పడేసుకున్నావ్?
 చిత్రగుప్తుడు: ఆకాశంలో
 ఎస్‌ఐ: ఆ....(ఆశ్చర్యంగా) ఆకాశంలోనా...? అక్కడికి నువ్వెందుకు వెళ్లావ్?
 చిత్రగుప్తుడు: మేఘాల్లో మీటింగ్ ఉండి...!
 ఎస్‌ఐ: మేఘాల్లో...
 చిత్రగుప్తుడు: మీటింగ్.. మీటింగ్...?
  అప్పుడు  కానిస్టేబుల్‌తో... అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నా డురా. కానిస్టేబులో ఓ వెకిలి నవ్వు నవ్వుతాడు.
 
 దీంతో ఎస్‌ఐ అసహనంతో
 ఎస్‌ఐ: నవ్వకు నవ్వకు... నగరపౌరులు చూస్తున్నారక్కడ...!
 ఈ సూట్‌కేస్ ఏంటి?
 చిత్రగుప్తుడు: సూట్‌కేస్
 ఎస్‌ఐ: అదే అందులో ఏమున్నాయ్? అని అడుగుతున్నా.
 
 చిత్రగుప్తుడు: వజ్ర వైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యమ్ములు కూర్చబడిన కంకణములు, నవరత్నములు చేర్చబడిన కిరీటము ఇంకనూ.....
 ఎస్‌ఐ: ఊ......ఐ...సీ (ఆపమని చేయి చూపిస్తూ)
 చిత్రగుప్తుడు: ఓకే యూ...సీ...
 
 (ఎస్‌ఐ సూట్‌కేస్ తెరిచి చూసి అవాక్కవుతాడు. అన్నీ ఆకులే...!)
 ఎస్‌ఐ: ఇందులో ఏమున్నాయ్ నాన్నా....?
 వజ్ర వైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు, రత్నమాణిక్యమ్ములు కూర్చబడిన కంకణములు.....
 ఎస్‌ఐ: ఊ....!ఆపేయ్!!
 అప్పుడు  పక్కన  కానిస్టేబుల్‌తో... అసలు మన గురించి వీడు ఏమనుకుంటున్నాడురా... కానిస్టేబులో ఓ వెర్రి నవ్వు నవుతాడు. దీంతో ఎస్‌ఐ అసహనంతో టేబుల్‌ను చేతితో కొడుతూండగా...
 
 చిత్రగుప్తుడు: ఏంటి సార్! అన్ని ఆభరణములు చూసేసరికి కళ్లు తిరుగుతున్నాయా!
 ఎస్‌ఐ: తిరుగుతాయ్ తిరుగుతాయ్..! ముందు పుస్తకాల పాయింట్‌కు రా..!
 ఆఫ్ట్రాల్ పుస్తకం పోయిందని పోలీస్ స్టేషన్‌కొచ్చి రిపోర్టు ఇస్తున్నావంటే అది చాలా ఇంపార్టెంట్ బుక్ అయి ఉంటుంది.
 
 చిత్రగుప్తుడు: ఔను సార్!
 ఎస్‌ఐ: అందులో ఏముంది?
 చిత్రగుప్తుడు: ఎవరి ప్రాణం ఎప్పుడు తీయవలెనో రాసుంది.
 
 ఎస్‌ఐ: ఆ...!(ఆశ్చర్యంగా)
 వెంటనే పక్కనున్న కానిస్టేబుల్‌తో
 ఏంట్రా ఈడి బిహేవియరూ! నా పేరు చెబితే టైస్టులకే టై...
 హిట్ లిస్ట్ పుస్తకం పోయిందని నాకే  కంప్లైంటు ఇస్తున్నాడు. అసలు ఏంటంటావ్ ఈడి బ్యాకింగూ...?
 ఎస్‌ఐ: ఆ... ఏంటి బాబూ! అందులో ఎప్పుడు చచ్చిపోతామో రాసుందా..?
 మరి నా చావు రాసి ఉందా?
 చిత్రగుప్తుడు: ఆ ఉంది కదా!
 
 (వెంటనే ఎస్‌ఐ స్పృహ తప్పి పడిపోతాడు)
 - ఈ సన్నివేశం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’ చిత్రంలోనిది.
 ఇందులో బ్రహ్మానందం వల్ల ముప్పుతిప్పలు పడే ఎస్‌ఐగా కోట శ్రీనివాసరావు నటన హైలై ట్.     
 - శశాంక్.బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement