నైట్‌ షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్‌ ఎక్కువ | Working in nocturnal shifts ups risk of obesity  | Sakshi
Sakshi News home page

నైట్‌ షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్‌ ఎక్కువ

Oct 4 2017 8:30 PM | Updated on Oct 4 2017 8:30 PM

Working in nocturnal shifts ups risk of obesity 


వాషింగ్టన్‌: నైట్‌ షిఫ్ట్‌ల్లో తరచూ పనిచేసేవారికి త్వరగా లావెక్కి ఒబెసిటీకి గురయ్యే ప్రమాదం 29 శాతం అధికమని ఓ అథ్యయనంలో వెల్లడైంది. అడపాదడపా నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసే వారితో పోలిస్తే నిత్యం రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ముప్పు మరింత ఎక్కువని తేలింది.రాత్రి వేళల్లో పనిచేయడాన్ని వీలైనంత తగ్గిస్తే ఒబెసిటీ రిస్క్‌ నుంచి కొంతమేర తప్పించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

పలు ప్రచురిత అథ్యయనాలను విశ్లేషించిన నిపుణులు ఈ అంశాన్ని నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది ఉద్యోగులు షిఫ్ట్‌ వర్క్‌ల్లో నిమగ్నమయ్యారని సీనియర్‌ స్టడీ రచయిత డాక్టర్‌ లాప్‌త్సే వివరించారు. ఇక షిఫ్ట్‌ల్లో పనిచేసేవారిలో పని స్వభావాన్ని అనుసరించి కూడా ఒబెసిటీ, ఓవర్‌వెయిట్‌ రిస్క్‌ ఉంటుందని అథ్యయనం వెల్లడించింది. ఒబెసిటీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌, మధుమేహం, గుండెజబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని ఈ అథ్యయనం​ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement