పోలీస్ ‘దర్బార్’! | Police 'Darbar'! | Sakshi
Sakshi News home page

పోలీస్ ‘దర్బార్’!

Feb 6 2015 12:08 AM | Updated on Apr 3 2019 6:23 PM

పోలీస్ ‘దర్బార్’! - Sakshi

పోలీస్ ‘దర్బార్’!

ఇవ్వాల్సింది ఇవ్వమంటే... ముక్కు మీద గుద్ది... ముఖం పచ్చడి చేశాడు బాలీవుడ్ మ్యూజిక్ డెరైక్టర్ ఇస్మాయిల్ దర్బార్.

ఇవ్వాల్సింది ఇవ్వమంటే... ముక్కు మీద గుద్ది... ముఖం పచ్చడి చేశాడు బాలీవుడ్ మ్యూజిక్ డెరైక్టర్ ఇస్మాయిల్ దర్బార్. డబ్బూ పోయి... దెబ్బలూ తిని లబోదిబోమన్న సదరు అసిస్టెంట్ డెరైక్టర్ ప్రశాంత్ చౌదరి పోలీసులకు మొరపెట్టుకున్నాడు. దెబ్బకు ఇస్మాయిల్‌ను తమ ‘దర్బార్’కు తీసుకు వచ్చి లోపలేశారు పోలీసులు. అతడితో పాటు అతని ఇద్దరు స్నేహితులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

అనంతరం బెయిలుపై బయటకు వచ్చారనేది ఇండియా టుడే కథనం. ఇస్మాయిల్‌కు ఓ ప్రాజెక్టు చేసినందుకు గాను ప్రశాంత్‌కు కొంత సొమ్ము రావల్సి ఉంది. అయితే ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోగా... ఇస్మాయిల్ తనపై స్నేహితులతో కలసి దాడి చేశాడన్నది అసిస్టెంట్ డెరైక్టర్ ఫిర్యాదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement