breaking news
Ismail Darbar
-
రూ.100 కోట్లు ఇచ్చినా సరే తనతో పని చేయను
రూ.100 కోట్లు ఇచ్చినా సరే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ (Ismail Darbar). వీరిద్దరూ 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్' సినిమాలకు కలిసి వర్క్ చేశారు. ఈ రెండు చిత్రాల ఘన విజయంలో ఇస్మాయిల్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. కలిసి బ్లాక్బస్టర్లు కొట్టిన వీళ్లిద్దరి మధ్య తర్వాత పెద్ద అగాధమే ఏర్పడింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ మాట్లాడాడు.భయమెందుకు?'హీరామండి ప్రాజెక్ట్ ఈ మధ్య అనుకుంది కాదు. రెండున్నర దశాబ్దాల కిందటే ఆ ప్రాజెక్ట్‌కు పునాది పడింది. ఆ సమయంలో ఓ వార్తాపత్రికలో హీరామండి ప్రాజెక్ట్‌కు నేను అందించే సంగీతమే వెన్నెముకలా నిలవనుంది అని రాశారు. ఇది నేనే పత్రికలో వేయించానని సంజయ్ అనుమానించాడు. పిలిచి నిలదీశాడు. నిజంగా నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీకు భయపడాల్సిన అవసరమే లేదు. నీ ముందు కూడా అదే చెప్తాను. అయినా పేపర్లో అది ఎవరు రాశారో నాకసలు తెలీనే తెలియదు అని చెప్పాను.నేనే బ్యాక్బోన్సరే, వదిలెయ్ అని అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వదిలెయ్ అన్నది ఈ విషయాన్ని కాదు, ప్రాజెక్ట్ అని నాకు తర్వాత అర్థమైంది. తనతో చెప్పించుకోవడం దేనికని నేనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా! తర్వాత.. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ సినిమాలకు నేనే వెన్నెముక అని సంజయ్ పీఆర్ టీమ్‌కు కూడా తెలిసొచ్చింది. కానీ సంజయ్‌కు ఇగో ఎక్కువ. నా కష్టానికి కూడా తనే క్రెడిట్ తీసుకుంటాడు. అందుకే తనతో పనిచేయకూడదనుకున్నాను. తను రూ.100 కోట్లు ఇచ్చినా సరే ఆయన సినిమాకు పని చేయను' అని ఇస్మాయిల్ చెప్పుకొచ్చాడు.చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్ -
'పెళ్లికి వయసుతో పనేంటి!'
న్యూఢిల్లీ: కొంత కాలంగా సహాజీవనం చేస్తున్న టీవీ స్టార్ గౌహర్ ఖాన్(37), కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25)ల జంట డిసెంబర్ 25న వివాహం చేసుకోనున్నారు. మంగళవారం ఈ జంట తమ పెళ్లి తేదీని ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబసభ్యులు, సన్నిహితులతో తమ వివాహ వేడుకను జరుపుకోనున్నట్లు తెలిపారు. కాగా గౌహర్ ఖాన్ కంటే జైద్ దర్బార్ 12 ఏళ్లు చిన్నవాడు. మీడియాలో వస్తున్న వార్తలపై గౌహర్ స్పందిస్తూ..‘మా ఇద్దరి మధ్య 12 సంవత్సరాల వ్యత్యాసం పెద్ద సమస్య కాదు. దీన్ని వార్త చేయడం చాలా సులభం. కానీ జైద్ నాకంటే పరిణితి చెందినవాడు, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. వయస్సు మా బంధానికి అడ్డుకాదు.’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై జైద్ స్పందిస్తూ.. మేమిద్దరం పరిణతి చెందనవారమే భావిస్తున్నాను. ఒకరికొకరం బాగా అర్థం చేసుకోగలమన్నారు.(చదవండి: సహజీవనం చేయాల్సిందే) కాగా మాజీ మోడల్ అయిన గౌహర్ ఖాన్ ది ఖాన్ సిస్టర్స్ షోలో ప్రముఖంగా కనిపించింది. రాకెట్ సింగ్, గేమ్, ఇషాక్జాడే వంటి చిత్రాలతో పాటు రియాల్టీ టీవీ షోలైన జాహాలక్ దిఖ్లా జా3, బిగ్‌బాస్7, ఫియర్ ఫాక్టర్: ఖత్రోస్ కే ఖిలాడి5, ఇటీవల బిగ్‌బాస్14 లో కూడా నటించారు. ఇక జైద్ దర్బార్ విషయానికి వస్తే .. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన ఈయన వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. -
‘నా కొడుకు కంటే దాదాపు ఐదేళ్లు పెద్దది’
ముంబై: తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్. ఏదైనా విశేషం ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని, వదంతులు నమ్మవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా బాలీవుడ్ కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు, కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను గౌహర్ వివాహమాడనున్నారంటూ గత కొన్నిరోజులుగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబరులో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరు పోస్ట్ చేసిన ఓ డాన్సింగ్ వీడియోలు, ఫొటోల ఆధారంగా గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.(చదవండి: ‘నాతో మాట్లాడటానికే భయపడింది.. కానీ’) ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న గౌహర్ ఖాన్, అక్కడికి వెళ్లడానికి ముందు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ జైద్‌తో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి జైద్ తండ్రి ఇస్మాయిల్ దర్బార్ తాజాగా స్పందించారు. జైద్, గౌహర్ ప్రేమలో ఉన్నారని, అయితే వారు ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్న విషయం గురించి తమకు తెలియదన్నాడు. ‘‘గౌహర్ అంటే తనకు అభిమానమని, ఆమె కూడా తనంటే ఇష్టపడుతుందని జైద్ నాకు చెప్పాడు. వారి బంధం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిజానికి గౌహర్ అంటే నాకూ, నా భర్య అయేషాకు ఎంతో ఇష్టం. (చదవండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు అయితే గౌహర్, జైద్ కంటే సుమారు ఐదేళ్లు పెద్దది. అంతకంటే ఎక్కువే కావొచ్చు కూడా. ఓ తండ్రిగా ఈ విషయం గురించి నా కొడుకు వద్ద ప్రస్తావించాను. నీది నిజమైన ప్రేమ అయితే వయసు అడ్డంకి కాదని, అయితే పెళ్లి చేసుకోవడానికి ముందే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. జైద్ ఇలాంటి పట్టించుకోనని చెప్పాడు. తనకు ఎలాంటి పట్టింపు లేదని చెప్పాడు. అప్పటి నుంచి గౌహర్ మాతో మరింత ఆప్యాయంగా మెలుగుతోంది. వాళ్ల జంట బాగుంటుంది. గౌహర్ నా కుమారుడి పట్ల చూపించే అనురాగం, ఆప్యాయతలు తను చూపే శ్రద్ధ మమ్మల్ని కట్టిపడేశాయి’’అని చెప్పుకొచ్చాడు.(వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) -
పోలీస్ ‘దర్బార్’!
ఇవ్వాల్సింది ఇవ్వమంటే... ముక్కు మీద గుద్ది... ముఖం పచ్చడి చేశాడు బాలీవుడ్ మ్యూజిక్ డెరైక్టర్ ఇస్మాయిల్ దర్బార్. డబ్బూ పోయి... దెబ్బలూ తిని లబోదిబోమన్న సదరు అసిస్టెంట్ డెరైక్టర్ ప్రశాంత్ చౌదరి పోలీసులకు మొరపెట్టుకున్నాడు. దెబ్బకు ఇస్మాయిల్‌ను తమ ‘దర్బార్’కు తీసుకు వచ్చి లోపలేశారు పోలీసులు. అతడితో పాటు అతని ఇద్దరు స్నేహితులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం బెయిలుపై బయటకు వచ్చారనేది ఇండియా టుడే కథనం. ఇస్మాయిల్‌కు ఓ ప్రాజెక్టు చేసినందుకు గాను ప్రశాంత్‌కు కొంత సొమ్ము రావల్సి ఉంది. అయితే ఎన్ని సార్లు అడిగినా ఇవ్వకపోగా... ఇస్మాయిల్ తనపై స్నేహితులతో కలసి దాడి చేశాడన్నది అసిస్టెంట్ డెరైక్టర్ ఫిర్యాదు.


