'పెళ్లికి వయసుతో పనేంటి!'

What Gauahar Khan Said About The Age Difference With Fiance Zaid - Sakshi

డిసెంబర్‌ 25న ఒక్కటి కానున్న గౌహర్‌‌, జైద్‌ల జంట

న్యూఢిల్లీ: కొంత కాలంగా సహాజీవనం చేస్తున్న టీవీ స్టార్‌ గౌహర్‌ ఖాన్(37)‌, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌(25)ల జంట డిసెంబర్‌ 25న వివాహం చేసుకోనున్నారు. మంగళవారం ఈ జంట తమ పెళ్లి తేదీని ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబసభ్యులు, సన్నిహితులతో తమ వివాహ వేడుకను జరుపుకోనున్నట్లు తెలిపారు. కాగా గౌహర్‌ ఖాన్‌ కంటే జైద్‌ దర్బార్‌ 12 ఏళ్లు చిన్నవాడు.

మీడియాలో వస్తున్న వార్తలపై గౌహర్‌ స్పందిస్తూ..‘మా ఇద్దరి మధ్య 12 సంవత్సరాల వ్యత్యాసం పెద్ద సమస్య కాదు.  దీన్ని వార్త చేయడం చాలా సులభం. కానీ జైద్‌ నాకంటే పరిణితి చెందినవాడు, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. వయస్సు మా బంధానికి అడ్డుకాదు.’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై జైద్‌ స్పందిస్తూ.. మేమిద్దరం పరిణతి చెందనవారమే భావిస్తున్నాను. ఒకరికొకరం బాగా అర్థం చేసుకోగలమన్నారు.(చదవండి: సహజీవనం చేయాల్సిందే)

కాగా మాజీ మోడల్‌ అయిన గౌహర్‌ ఖాన్‌ ది ఖాన్‌ సిస్టర్స్‌ షోలో ప్రముఖంగా కనిపించింది. రాకెట్‌ సింగ్‌, గేమ్‌, ఇషాక్జాడే వంటి చిత్రాలతో పాటు రియా‍ల్టీ టీవీ షోలైన జాహాలక్‌ దిఖ్లా జా3, బిగ్‌బాస్‌7, ఫియర్‌ ఫాక్టర్‌: ఖత్రోస్‌ కే ఖిలాడి5, ఇటీవల బిగ్‌బాస్‌14 లో కూడా నటించారు. ఇక జైద్‌ దర్బార్‌ విషయానికి వస్తే .. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన ఈయన వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top