అక్షర హాసన్
దేశం గర్వించదగ్గ హీరో కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి సాగరికల రెండో కుమార్తె అక్షర హాసన్ వెండితెర పరిచయానికి సిద్ద అయ్యింది.
	దేశం గర్వించదగ్గ హీరో కమల్ హాసన్, ప్రముఖ బాలీవుడ్ నటి సాగరికల  రెండో కుమార్తె  అక్షర హాసన్  వెండితెర పరిచయానికి సిద్ద అయ్యింది. తొలి అడుగు బాలీవుడ్లో వేసింది. మొదట దర్శకత్వ విభాగంలో పనిచేయాలని అక్షర ఆశించింది. అయితే  చివరకు అమ్మ, అక్కలాగా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది.   సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించే హిందీ చిత్రంలో అతనికి జోడీగా  నటిస్తోంది. 'షమితాబ్' అన్న పేరు  ఖరారు చేసి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ని బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల విడుదల చేశాడు.
	
	సోదరి శృతిహాసన్ ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో ఓ వెలుగు వెలుగుతుండటంతో అక్షర హాసన్కు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. అయితే ధనుష్, శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన '3' సినిమా  అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇప్పుడు ధనుష్ - అక్షర జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎంతవరకు  ప్రేక్షకుల ఆదరణ పొందగలదో విడుదల తర్వాత గానీ తెలియదు. షూటింగ్లో అక్షర పనితీరును గమనించిన సినీ పండితులు  కోలీవుడ్, టాలీవుడ్‌లలో  అక్క శృతి హాసన్కు  పోటిగా నిలుస్తుందని అంటున్నారు.
- శిసూర్య

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
