ఫ్లిప్కార్ట్లో ఐఫోన్6 ప్రీబుకింగ్ షురూ! | flipkart starts apple iPhone 6 pre bookings | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్లో ఐఫోన్6 ప్రీబుకింగ్ షురూ!

Oct 7 2014 12:27 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్కార్ట్లో ఐఫోన్6 ప్రీబుకింగ్ షురూ! - Sakshi

ఫ్లిప్కార్ట్లో ఐఫోన్6 ప్రీబుకింగ్ షురూ!

భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అమ్మకాలకు రంగం అప్పుడే సిద్ధమైపోయింది.

భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అమ్మకాలకు రంగం అప్పుడే సిద్ధమైపోయింది. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ దీని ప్రీబుకింగ్ మొదలుపెట్టేసింది. దీపావళి నాటికల్లా భారతదేశంలో ఐఫోన్6 అందుతుందని ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ద్వారానే దీన్ని అమ్ముతున్నట్లు తేలింది. ఇంతకుముందు చైనా యాపిల్గా పేరొందిన ఎంఐ3, రెడ్ ఎంఐ లాంటి ఫోన్లను కూడా ఫ్లిప్కార్ట్లో మాత్రమే అమ్మారు. వాటికి కూడా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఐఫోన్ 6కు కూడా ఇలాగే ప్రీబుకింగ్ను ఫ్లిప్కార్ట్ మొదలుపెట్టింది.

ఇందులో కూడా పలు రకాల మోడళ్లను ఆఫర్ చేస్తోంది. 16 జిబి మెమొరీతో కూడిన ఐఫోన్ 6ప్లస్ అయితే 62,500; 16 జిబి మెమొరీ గల ఐఫోన్ 6 అయితే 53,500; 128 జిబి మెమొరీ గల ఐఫోన్ 6 అయితే 71,500; 64 జిబి మెమొరీతో కూడిన ఐఫోన్ 6ప్లస్ అయితే 71,500; 128 జిబి మెమొరీ గల ఐఫోన్ 6ప్లస్ అయితే 80,500 చొప్పున ధరలు పెట్టారు. వీటన్నింటికీ ఇప్పటికే బుకింగ్ మొదలైపోయింది. బిగ్ బిలియన్ సేల్ పేరుతో 600 కోట్ల రూపాయల అమ్మకాలు సాధించిన ఫ్లిప్కార్ట్.. ఇప్పుడు ఐఫోన్ అమ్మకాలతో మరెంత ముందుకు వెళ్తుందోనని అంతా చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement