యాహూ న్యూస్ డెజైస్ట్... | yahoo news dejaist... | Sakshi
Sakshi News home page

యాహూ న్యూస్ డెజైస్ట్...

May 15 2014 12:42 AM | Updated on Nov 6 2018 5:26 PM

అంతర్జాతీయ వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా?

అంతర్జాతీయ వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యాహూ న్యూస్ డెజైస్ట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా రోజుకు రెండుసార్లు అప్‌డేట్ అయ్యే వార్తలను చూసుకోండి. వార్తలు, టెక్నాలజీ, స్పోర్ట్స్, బిజినెస్‌లకు సంబంధించిన వార్తలన్నింటినీ క్లుప్తంగా అందిస్తుంది ఈ అప్లికేషన్. ప్రతి వార్తాంశంలోనూ కథనాలు, అవసరమైన మ్యాపులు, ఫొటోలు కూడా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ హోమ్‌స్క్రీన్‌పై ఒక విడ్జెట్ ద్వారా తాజా వార్తలు ఏమున్నాయి? వాటిల్లో మీరు చదవనివి ఏవి? అన్నది చూసుకోవచ్చు. ఈ వార్తల సేకరణ, సంక్షిప్తీకరణ కోసం యాహూ యూకే, అమెరికా, మలేషియాల్లో ప్రత్యేక బందాలను నియమించింది. ఉదయం ఎనిమిది గంటలకు, రాత్రి 6 గంటలకు ఒకసారి వార్తలు అప్‌డేట్ అవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement