రక్తపోటును నియంత్రించే అరటిపండు | uses of banana | Sakshi
Sakshi News home page

రక్తపోటును నియంత్రించే అరటిపండు

Nov 28 2017 1:19 AM | Updated on Nov 28 2017 1:19 AM

uses of banana - Sakshi

అరటిపండు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. రెడీగా ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ...
♦ అరటిపండులో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది రక్తపోటును స్వాభావికంగా నియంత్రిస్తుంది
♦ ఇందులో ఉండే పొటాషియమ్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.
♦ అరటిపండులోని ట్రిప్టోఫాన్‌ను మన శరీరం సెరిటోనిన్‌గా మార్చుకుంటుంది. ఈ సెరిటోనిన్‌ మన మూడ్స్‌ బాగుండేలా చూసే రసాయనం
♦ అరటిపండులో పీచు (ఫైబర్‌) పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
♦ అరటిలోని అమైనో యాసిడ్స్‌ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి
♦ అరటిపండు కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది
♦ అరటిలో క్యాల్షియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేగాక వీటిలోని క్యాల్షియమ్‌ మన ఒంట్లోకి తేలిగ్గా ఇంకేలా అరటిపండులోనే పుష్కలంగా ఉండే ఫ్రక్టోలిగోశాకరైడ్స్‌ అనే పదార్థం దోహదం చేస్తుంది
♦అరటిపండు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement