
చేతుల చర్మం పొడిబారిందా?
గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వల్ల సబ్బుల్లోని రసాయనాలు చేతుల చర్మం పై ప్రభావాన్ని చూపుతాయి.
గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వల్ల సబ్బుల్లోని రసాయనాలు చేతుల చర్మం పై ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంటుంటుంది. నిర్లక్ష్యం చేస్తే త్వరగా ముడతలు కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకూడదు అంటే.. పని పూర్తయిన తర్వాత లిక్విడ్ సోప్‌తో చేతులను శుభ్రపరుచుకుని, కొబ్బరి నూనెతో చేతులను మర్దనా చేసుకోవాలి. కొబ్బరి నూనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరగదు.