కళ్లతో కాదు... దిమాక్‌తో! | Ravi Teja, Mehreen Kaur's movie shoot in Darjeeling | Sakshi
Sakshi News home page

కళ్లతో కాదు... దిమాక్‌తో!

Apr 16 2017 1:59 AM | Updated on Sep 5 2017 8:51 AM

కళ్లతో కాదు... దిమాక్‌తో!

కళ్లతో కాదు... దిమాక్‌తో!

‘కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ – ‘దూకుడు’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ ఇది.

‘కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ – ‘దూకుడు’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ ఇది. ఆ సినిమాలో మహేశ్‌ ఏదైతే చెప్పారో ఇప్పుడు రవితేజ అలానే చేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ! మరేం లేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘రాజా.. ది గ్రేట్‌’లో మాస్‌ మహారాజా రవితేజకు కళ్లు కనిపించవు. కానీ, దునియా మొత్తం అతనికి కనిపిస్తుందట.

ఎలాగంటే... మాస్‌రాజా కళ్లతో కాదు, దిమాక్‌తో దునియా చూస్తాడు. రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శిరీష్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. ఇదేదో ఆర్ట్‌ ఫిల్మ్‌లా ఉండదని చిత్రబృందం అంటోంది. అలీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్‌’ రఘు తదితర కమెడియన్స్‌ ఉన్నారీ సిన్మాలో. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ హీరోయిన్‌. సరికొత్త కథతో పక్కా కమర్షియల్‌ పద్ధతిలో సిన్మాను తెరకెక్కిస్తున్నారట. ఆర్టిస్టులు, జోకులు... షూటింగ్‌ స్పాట్‌ యమా సందడిగా ఉంటోందట. ప్రస్తుతం డార్జిలింగ్‌లో షూటింగ్‌ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement