క్విక్‌ఫుడ్‌ | quick food | Sakshi
Sakshi News home page

క్విక్‌ఫుడ్‌

Jan 30 2017 11:24 PM | Updated on Sep 5 2017 2:29 AM

క్విక్‌ఫుడ్‌

క్విక్‌ఫుడ్‌

కోకోనట్‌ బర్ఫీ

కోకోనట్‌ బర్ఫీ
కావలసినవి: కొబ్బరితురుము – 6 కప్పులు పాలు – 4 కప్పులు పంచదార – 4 కప్పులు ఏలకులు – 6 జీడిపప్పు – 10
తయారి:ముందుగా బాణలిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగాక జీడిపప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పాలు, పంచదార, నెయ్యి, కొబ్బరి తరుము, జీడిపప్పు పొడి వేసి సన్నని సెగపై పెట్టి గరిటెతో కలుపుతూండాలి. అది దగ్గరగా వస్తుండగా ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన  ప్లేటులో పోసి నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

Advertisement

పోల్

Advertisement