breaking news
Quick Food
-
క్విక్ రెస్టారెంట్లకు ధరల సెగ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్ఆర్ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్ఆర్ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్ కిచెన్ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది. సామర్థ్యాలు పెంచుకోవాలి.. జూబిలెంట్ ఫుడ్స్లాంటి క్యూఎస్ఆర్ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్ఆర్ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్ క్యూఎస్ఆర్ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. అదే ఫుడ్ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్ఆర్ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్ఆర్ సంస్థలు ఆశిస్తున్నాయి. -
క్విక్ఫుడ్
కోకోనట్ బర్ఫీ కావలసినవి: కొబ్బరితురుము – 6 కప్పులు పాలు – 4 కప్పులు పంచదార – 4 కప్పులు ఏలకులు – 6 జీడిపప్పు – 10 తయారి:ముందుగా బాణలిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగాక జీడిపప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పాలు, పంచదార, నెయ్యి, కొబ్బరి తరుము, జీడిపప్పు పొడి వేసి సన్నని సెగపై పెట్టి గరిటెతో కలుపుతూండాలి. అది దగ్గరగా వస్తుండగా ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోసి నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.