బొప్పాయి ప్యాక్‌

Papaya Promote Health Increase Immunity Power - Sakshi

బ్యూటిప్స్‌

రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని పెంపొందించే బొప్పాయి మేని నిగారింపులోనూ మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

►బొప్పాయి గుజ్జుతో ప్యాక్‌ వేసుకుంటే మలినాలు తొలగిపోతాయి. చేతులు, పాదాలపై ఉన్న ట్యాన్‌ వదిలిపోతుంది.

►అరకప్పు బొప్పాయి గుజ్జులో టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలు, చేతులు, ముఖానికి రాసి మసాజ్‌ చేయాలి. పదినిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదుత్వం పెరుగుతుంది. పొడిబారిన చర్మానికి ఇది మేలైన ప్యాక్‌.

►టేబుల్‌ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వారంలో మూడుసార్లయినా ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డు తగ్గి, నిగారింపు పెరుగుతుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top