పెయింటర్ శ్రీదేవి!

యాక్టర్–డైరెక్టర్, యాక్టర్– ప్రొడ్యూజర్.. ఎప్పుడూ వినిపించేమాట. తక్కువగా వినిపించే మాట యాక్టర్– పెయింటర్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సల్మాన్‌ఖాన్ అందరికీ తెలిసిన యాక్టర్– పెయింటర్. టైమ్ దొరికినప్పుడు ఆయన పెయింటింగ్ వేస్తారు. ఫ్రెండ్స్‌కి గిఫ్టుగా ఇస్తారు. ఛారిటీ కోసం కొన్నిటిని అమ్మేస్తారు. ఆయన ఒక్కరేనా ఇలా యాక్టర్–పెయింటర్? ఇంతవరకు ఒక్కరే అనుకున్నాం.
ఇక ముందు అలా అనుకోడానికి లేదు. సీనియర్ నటి శ్రీదేవి వచ్చే నెల దుబాయ్‌లో జరుగుతున్న వేలానికి తన పెయింటింగ్‌లను పంపుతున్నారు. అరే! ఎప్పుడు వేశారు? వారానికి 5 నుంచి పది గంటలకు పెయింటింగ్‌లోనే ఉంటున్నారట శ్రీదేవి.
‘సావారియా’లో సోనమ్ కపూర్ పోర్ట్‌రైట్‌ని, మైఖేల్ జాన్సన్‌నీ కంప్లీట్ చేసి ప్లయిట్‌కి కూడా సిద్ధం చేస్తున్నారు. మిగతావి కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఈ రెండు పెయింటింగ్‌లనే శ్రీదేవి ఎంపిక చేసుకున్నారు. వేలంలో ఒక్కో పెయింటింగ్ ప్రారంభ ధర 8 లక్షల రూపాయలట. వచ్చిన డబ్బుని సేవా సంస్థలకు విరాళంగా ఇవ్వాలని శ్రీదేవి ముందే నిర్ణయించుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి