గీత స్మరణం | NTR's badshah song | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Nov 26 2013 11:25 PM | Updated on Sep 2 2017 1:00 AM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి : ఆమె: ఒంటరేళ తుంటరోడు ఒంటిగుంటే ఒదిలిపోడు గండు చీమలాగ నన్ను కుట్టినాడు బుద్ధుడల్లె ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు అతడు: చందనాల చెక్కలాంటి చక్కనైన పిల్లా చాందినీల చుక్క సిగ్గు చెక్కి పోతే ఎల్లా చెంపకేసి అద్దు ముద్దు పావడాల బిళ్ల

 పల్లవి :
 ఆమె: ఒంటరేళ తుంటరోడు ఒంటిగుంటే ఒదిలిపోడు
 గండు చీమలాగ నన్ను కుట్టినాడు
 బుద్ధుడల్లె ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు
 బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు
 అతడు: చందనాల చెక్కలాంటి చక్కనైన పిల్లా
 చాందినీల చుక్క సిగ్గు చెక్కి పోతే ఎల్లా
 చెంపకేసి అద్దు ముద్దు పావడాల బిళ్ల
 చేతులోంచి జారిపోకే ఓసి సబ్బు బిళ్ల
 నేతి అరిసెలా పూల బరిసెలా
 సానబెట్టి సూది కళ్లు గుండెలోన గుచ్చమాకలా
 కుర్ర ఈడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి
 గుంజుతుంటే గింజుకోవ ఆశలన్ని
 పాతికేళ్ల మీసకట్టు ఒక్క చూపుతోటే ఫట్టు
 చేసుకోవే జిల్లుమన్న దిల్లు బోణి
 చరణం : 1
 ఆ: పావుగంట కౌగిలిస్తే తీయగా
 అ: పావుసేరు తేనెకైనా అంత తీపి లేదుగా
 ఆ: ఎక్కడో తళుక్కు మంది పిల్లగా
 అ: పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా
 ఆ: లేడికళ్ల చిన్నదాన్ని వాటి చూపులేసి
   ప్రేమతోటి కొట్టినావుగా
 గాజు బొమ్మలాంటి దాన్ని జారిపోనివ్వకుండా
   ప్రాణమేసి పట్టినావుగా
 అ: సిగ్గు పడకలా నెగ్గినావే పిల్లా
 చిలిపి చిలకలా కలికి కులుకులా
 జారుతున్న దోర గుండె కోరికోరి కోరకమాకలా
 ॥ఈడు॥
 చరణం : 2
 ఆ: ఇక్ డోలు డోలు డోలునా
 అ: పరికిణీలో చందమామ పరిణయం కోరేనా
 ఆ: ఇక్ డోలు డోలు డోలునా
 అ: చుక్కలాంటి చక్కనమ్మ బుగ్గ చుక్క అడిగేనా
 ఆ: పొయ్యి మీద పాలకుండ పొంగి పొర్లి పోయే
   పండగేదో ముందరుందనా
 పక్కమీద సన్నజాజి పూలే జల్లే
   సంగతేదో సణుగుతోందనా
 అ: సొగసు సంకెలా విసరకే పిల్లా
 కొసరు నడుముతో ఎసరు ముసరగా
 తస్సదియ్య కస్సుమన్న కన్నెతోడు కన్ను కొట్టగా
 ॥ఈడు॥
 చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
 రచన : శ్రీమణి
 సంగీతం : ఎస్.ఎస్.థమన్
 గానం : శంకర్‌మహదేవన్, సుచిత్ర
 
 నిర్వహణ: నాగేశ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement